జగనన్న సురక్షతో మెరుగైన వైద్యసేవలు
ప్రజాశక్తి-మర్రిపాడు : జగనన్న ఆరోగ్య సురక్షతో మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని వైసిపి మాజీ కన్వీనర్ గంగవరపు శ్రీనివాసులు నాయుడు పేర్కొన్నారు. శనివారం మండలంలోని రామానాయుడుపల్లిలో స్థానిక సర్పంచ్ పంగులూరి వెంకటేశ్వర్లు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కన్వీనర్ మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్షతో ప్రజల ఇంటి వద్దకే వైద్యం అందుతుందన్నారు. గ్రామాలలో ప్రతి ఇంటికి వెళ్లి అనారోగ్యముతో ఉన్న వారిని గుర్తించి వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ వైద్య శిబిరంలో 7రకాల పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు తెలియజేశారు. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంగన్‌వాడీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పలువురు నాయకులు పరిశీలించి తయారు చేసిన పలురకాల ఆహార పదార్థాలను రుచి చూశారు. కార్యక్రమంలో ఎంపిడిఒ నాగమణి, వైసిపి మండల కన్వీనర్ బొర్రా సుబ్బిరెడ్డి, నందవరం ఎంపిటిసి నూనె ప్రసాద్ యాదవ్, వైసిపి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ చెవుల శ్రీనివాసులు యాదవ్, నందవరం సర్పంచ్ రామ్మోహన్, అల్లంపాడు గ్రామ సచివాలయ కన్వీనర్ షేక్ మౌలాలి, వైద్యాధికారి డాక్టర్ గోపీనాథ్, ఆరోగ్య మండల విస్తరణా ధికారి కొండారెడ్డి, వైసిపి నాయకులు పంగులూరి శ్రీనివాసులు నాయుడు, కల్లూరి జనార్దన్ రెడ్డి, పంగులూరి వెంకటేశ్వర్లు నాయుడు, గ్రామ సచివాలయ, వైద్య, ఐసిడిఎస్ అధికారులు పాల్గొన్నారు.










