ప్రజాశక్తి - లింగసముద్రం :జగనన్న సురక్ష ద్వారా ప్రజలకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేస్తున్నారని, ఈ కార్యక్రమం అన్ని వర్గాల వారికి వైద్యసేవలందుతున్నాయని ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం లింగసమువ్రం సచివాలయం-2 పరిధిలో జగనన్న సురక్ష కార్యక్రమం స్థానిక మండల ఆరోగ్య కేంద్రంలో నిర్శహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహీధర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులోనే వైద్యం అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి శ్రీకారం చూట్టారన్నారు. అన్ని రకాల పరీక్షలు చేసి వారికి అవసరమైన మందులను ఉచితంగానే ఇస్తున్నట్లు తెలిపారు. 541 మందికి వివిధ రకాల వ్యాధులకు డాక్టర్ రమేష్, డాక్టర్ వర్షిత, డాక్టర్ మౌనిక, డాక్టర్ పేరయ్య, డాక్టర్ సమీర్ పరీక్షించారు. తహాశీల్ధార్ టి.ప్రసాద్,ఎంపిడిఓ శేషుబాబు,ఎస్‌ఐ బాజీబాబు,సిహెచ్‌ఓ శ్రీనివాసులు, సర్పంచ్ పులి రాఘవులు,వైసిపి మండల కన్వీనర్ పిచ్చపాటి తిరుపతిరెడ్డి,జెసిఎస్ కన్వీనర్ వరికూటి క్రిష్ణారెడ్డి,కోఆప్షన్ సభ్యులు షేక్ షఫి,సర్పంచ్ డబ్బుగొట్టు మల్లిఖార్జున,వైసిపి నాయకులు సూరం కొండారెడ్డి,మచేపల్లి మాల్యాద్రి,ఉప్పతి వెంకటేశ్వరరెడ్డి,మైలా కేశవరావు,పంచాయితీ కార్యదర్శి మాధవరావు ఉన్నారు.










