Jul 01,2023 22:14

ప్రజాశక్తి - ఆచంట
           అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని ఆచంట ఎంఎల్‌ఎ చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. ఆచంట మండలంలో శనివారం జగనన్న సురక్ష కార్యక్రమాలు ఆచంట, పెదమల్లం పంచాయతీ కార్యాలయం వద్ద ఆయా సర్పంచులు కోట సరోజినీ వెంకటేశ్వరరావు, దిరిశాల విజయలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు ఎంఎల్‌ఎ శ్రీరంగనాథరాజు ధ్రువీకరణ పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ జగన్నాధరావు, తహశీల్దార్‌ సుబ్రహ్మణ్యం, పంచాయతీ కార్యదర్శులు జివిఎన్‌ఎల్‌ నరసింహరావు, డి.నాని, విఆర్‌ఒలు సీతారాం, శేషు, వివిధ శాఖల అధికారులు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.
               పెనుమంట్ర:మండలంలోని భట్లమాగుటూరు, ఆలమూరు సచివాలయం వద్ద జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ఎంఎల్‌ఎ చెరుకువాడ శ్రీరంగనాధరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలమూరు సర్పంచి మేడపరెడ్డి వెంకటరమణ, ఎఎంసి ఛైర్మన్‌ వెలగల వెంకటరమణ (మిస్సమ్మ), జెడ్‌పిటిసి సభ్యులు కర్రి గౌరీ సుభాషిణి, ఓడూరు ఎంపిటిసి సభ్యులు ఈది అనిత, తహశీల్దార్‌ దండు అశోక్‌, ఎంపిడిఒ వి.పూర్ణబాబ్జి పాల్గొన్నారు.
        పెనుగొండ : మండలంలోని పెనుగొండ, వడలి గ్రామాల్లో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎంఎల్‌ఎ చెరుకువాడ శ్రీరంగనాధరాజు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యులు గోవర్ధన్‌, ఎంపిపి పోతినేడి వెంకటేశ్వరరావు, తహశీల్దార్‌ గురుమూర్తి రెడ్డి పాల్గొన్నారు.
            మొగల్తూరు : మొగల్తూరులోని సత్రవపాలెంలో ఉన్న సచివాలయం-1లో ఎంపిడిఒ ఉండ్రు బాబ్జి రాజు అధ్యక్షతన నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ప్రభుత్వ చీప్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి విజయలక్ష్మి, సర్పంచి పడవల మేరీ సత్యనారాయణ, జెడ్‌పిటిసి సభ్యులు తిరుమను బాపూజీ, వైస్‌ ఎంపిపి కైలా సుబ్బారావు, అందే భుజంగరావు పాల్గొన్నారు.
        పాలకొల్లు రూరల్‌ : మండలంలోని అరట్లకట్ట, అగర్తిపాలెం గ్రామాల్లో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎంఎల్‌ఎ నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, వైస్‌ ఎంపిపి సునీల్‌, మైకేల్‌ రాజు, చిట్టూరి ఏడుకొండలు పాల్గొన్నారు.
        పోడూరు : మండలంలోని పోడూరు-1, తూర్పుపాలెం గ్రామ సచివాలయాల పరిధిలో శనివారం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ శ్రీ రంగనాథరాజు ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారులకు కొత్తగా మంజూరైన ధ్రువపత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యులు గుంటూరు పెద్దిరాజు, ఎంపిపి సుమంగళి సాగర్‌, తహశీల్దార్‌ ఆర్‌వి.కృష్ణారావు, ఎంపిడిఒ డి.సుహాసిని పాల్గొన్నారు.
           నరసాపురం :అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా భావించి రాష్ట్ర ప్రభుత్వం కుల, మత రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు, సేవలందించే ప్రక్రియే జగనన్న సురక్ష కార్యక్రమమని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.రామ్‌సుందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని చిట్టవరం గ్రామ సచివాలయం వద్ద జగనన్న సురక్ష కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అర్హులకు కుల ధ్రువీకరణ పత్రాలు, ఆదాయ ధ్రువపత్రాలు, కౌలు రైతు కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి తాడి లక్ష్మీనరసింహ, ఎంపిటిసి సభ్యులు నక్కా లక్ష్మీనారాయణ, ఎంపిడిఒ శివప్రసాద్‌ యాదవ్‌, డిప్యూటీ తహశీల్దార్‌ జ్యోతి, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. ప్రజలు సంతృప్తి చెందే విధంగా జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. మండలంలోని చిట్టవరం గ్రామంలో పట్టణ పరిధిలో ఒకటో వార్డు శ్రీహరిపేట సచివాలయాల్లో శనివారం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు పాల్గొన్నారు. అనంతరం నరసాపురం పట్టణం అంబేద్కర్‌ భవనంలో రూ.7.65 లక్షలతో నిర్మించిన కిచెన్‌ షెడ్‌ను ఆయన ప్రారంభించారు.
             తాడేపల్లిగూడెం : పట్టణంలోని ఒకటి, రెండు, మూడు వార్డులకు సంబంధించి వీకర్స్‌ కాలనీలో రెండో వార్డ్‌ సచివాలయంలో, చిన్న తాడేపల్లి గ్రామంలో శనివారం జగనన్న సురక్ష శిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డిఒ సూర్యతేజ, నియోజకవర్గ ప్రత్యేక అధికారి అడపా దుర్గేష్‌, మున్సిపల్‌ కమిషనర్‌ డాక్టర్‌ అనపర్తి శామ్యూల్‌ పాల్గొన్నారు.