Jul 13,2023 17:39

ప్రజాశక్తి - కాళ్ల
జగనన్న సురక్ష కార్యక్రమం అర్హులకు ఉపయోగకరమని డిసిసిబి ఛైర్మన్‌ పివిఎల్‌.నరసింహరాజు అన్నారు. జువ్వలపాలెం, సీసలి గ్రామాల్లో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ప్రజలకు అవసరమైన కుల, ఆదాయ, నివాస, అడంగళ్‌, పింఛన్‌, రేషన్‌కార్డు, వితంతు, కుటుంబ సభ్యుల పేర్లు విభజన, ఆధార్‌లింక్‌, కౌలురైతులకు సిసిఆర్‌సి కార్డులు తదితర ధ్రువీకరణ పత్రాలను ఎలాంటి సర్వీసు ఛార్జీలు లేకుండా ఉచితంగా ఈ కార్యక్రమంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి కె.కిషోర్‌ కుమార్‌, తహశీల్దార్‌ టిఎ.కృష్ణారావు, జెడ్‌పిటిసి పచ్చిగోళ్ల సోమేశ్వరరావు, జువ్వలపాలెం గ్రామ సర్పంచి మీసాల రమణ, ఎంపిపి శిరీష విశ్వనాథరాజు, సీసలి సర్పంచి బిళ్లకుర్తి ధనలక్ష్మి, ఉప సర్పంచులు కఠారి లక్ష్మీపతిరాజు, బాతు మాణిక్యాలరావు, గణేశ్న రాంబాబు, రుద్రరాజు రామకృష్ణంరాజు, ముదుండి సురేష్‌ రాజు పాల్గొన్నారు.
పెనుమంట్ర:సోమరాజు ఇల్లింద్రపర్రులోని ఓటర్లే గత ఎన్నికల్లో పితాని సత్యనారాయణకు ఓట్లు వేశారని ఎంఎల్‌ఎ చెరుకువాడ శ్రీ రంగనాథరాజు తెలిపారు. గురువారం సోమరాజు ఇల్లింద్రపర్రు, మల్లిపూడి గ్రామాల్లో జగనన్న సురక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడారు. అనంతరం లబ్ధిదారులకు కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచి వనుం సూర్యనారాయణ, ఎంపిపి కర్రి వెంకటనారాయణ రెడ్డి (వాసు రెడ్డి), జెడ్‌పిటిసి కర్రి గౌరీ సుభాషిణి, తహశీల్దార్‌ దండు అశోక్‌ వర్మ పాల్గొన్నారు.
పోడూరు : ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మాత్రమేనని ఎంఎల్‌ఎ చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. మండలంలోని కవిటం-1, పండిత విల్లూరు గ్రామ సచివాలయాల పరిధిలో గురువారం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఎల్‌ఎ శ్రీరంగనాథరాజు ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారులకు కొత్తగా మంజూరైన ధ్రువపత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. దేశ చరిత్రలోనే రికార్డు స్థాయిలో వైసిపి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తోందన్నారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి గుంటూరు పెద్దిరాజు, ఎంపిపి సుమంగళిసాగర్‌, తహశీల్దార్‌ ఆర్‌వి.కృష్ణారావు, ఎంపిడిఒ డి.సుహాసిని, సర్పంచులు పాల్గొన్నారు.
వీరవాసరం :గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇంటి వద్దకే ధ్రువపత్రాలు అందజేస్తున్న ఘనత వైసిపి ప్రభుత్వానికి దక్కుతుందని భీమవరం ఎఎంసి ఛైర్మన్‌ కోటిపల్లి బాబు అన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమాన్ని వీరవాసరం, రాయకుదురులో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందిస్తున్న వాలంటీర్లను అభినందించారు. అనంతరం ఉత్తమ సేవలందించిన వాలంటీర్లకు సర్పంచి చికిలే మంగతాయారు, పంచాయతీ కార్యదర్శి జెడివి.ప్రసాద్‌ ఆర్థిక సహకారంతో బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌ గొలగాని సత్యనారాయణ, జెసిఎస్‌ మండల కన్వీనర్‌ మానుకొండ ప్రదీప్‌కుమార్‌ పాల్గొన్నారు.
పాలకొల్లు రూరల్‌ : లంకలకోడేరులో జగనన్న సురక్ష కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఎల్‌సి కవురు శ్రీనివాస్‌ పాల్గొని మాట్లాడారు. ప్రజలకు త్వరితగతిన సేవలందించే ప్రక్రియ జగనన్న సురక్ష కార్యక్రమం అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంఎల్‌సి మేకా శేషుబాబు, ఎంపిపి చిట్టూరి కనకలక్ష్మి, సర్పంచి చొప్పల రజిని పాల్గొన్నారు.
ఆచంట : అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన జగనన్న సురక్ష కార్యక్రమానికి ప్రజలంతా భాగస్వామ్యం కావాలని ఎంఎల్‌ఎ చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. కొడమంచిలిలో గురువారం జగనన్న సురక్ష కార్యక్రమం కొడమంచిలి రైతు సంఘం కార్యాలయంలో సర్పంచి సుంకర సీతారాం అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు ఎంఎల్‌ఎ రంగనాథరాజు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొడమంచిలిలో ఈ నాలుగు సంవత్సరాల్లో సుమారు రూ.45 కోట్లకుపైగా లబ్ధి పొందారున్నారు. పేదలకు అందిస్తున్న సంక్షేమాన్ని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ జగన్నాధరావు, తహశీల్దార్‌ సుబ్రహ్మణ్యం, ఆర్‌డిబ్ల్యూఎస్‌ ఎఇ ఎం.మూర్తిరాజు, పంచాయతీ కార్యదర్శి డి.నాని, విఆర్‌ఒలు శేషు, వెంకట్‌ రాజు పాల్గొన్నారు.