Oct 21,2023 19:06

స్టాల్స్‌ను పరిశీలిస్తున్న అధికారులు

ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు అర్బన్‌ పరిధిలో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక శ్రీరామ కాలనీ సచివాలయం పరిధిలో ఉన్న ప్రజలకు షాధీఖానా వద్ద ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జెసిఎస్‌ కో ఆర్డినేటర్‌ ముప్పవరపు కిషోర్‌ మాట్లాడారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజల ముంగిటకు వైద్యం అందుబాటులోకి వచ్చింది. దీని వల్ల ప్రతి కుటుంబ గడపలో ఆరోగ్యం వెల్లివిరవాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఈ పథకం అమలు చేస్తున్నారన్నారు.కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహిధరరెడ్డి గారి పర్యవేక్షణలో నిపుణులైన వైద్యులతో స్త్రీల వైద్య నిపుణులు పిల్లల వైద్యనిపుణులు కంటి వైద్యులతో పాటు జనరల్‌ వైద్య నిపుణులు కూడా క్యాంపులో సేవలందించారు. టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ శ్రీనివాస రావు మాట్లాడారు. మున్సిపల్‌ డి ఈ రమేష్‌ హెల్త్‌ ఆఫీసర్‌ బషీర్‌ సచివాలయం కన్వీనర్లు దేవరకొండ ఆదిలక్ష్మి యన్‌.రమేష్‌ హాఫిజ్‌ ఉన్నారు.