Jul 02,2023 21:42

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఉషశ్రీచరణ్‌

     కళ్యాణదుర్గం : ఈ నెల 8వ తేదీన కళ్యాణదుర్గంకి రానున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సభలో నియోజకవర్గంలోని ప్రతి వైసిపి నాయకుడు, కార్యకర్త, ప్రజలు పాల్గొని విజయవంతం చేద్దామని మంత్రి ఉషాశ్రీచరణ్‌ తెలిపారు. ఆదివారం నాడు కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం మండలాల వైసిపి నాయకులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 8న వైఎస్‌ఆర్‌ రైతు దినోత్సవం సందర్భంగా కళ్యాణదుర్గంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోన్‌రెడ్డి పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రైతుల ఖాతాల్లో ఇన్‌పుట్‌ సబ్సిడీ జమ చేస్తారన్నారు. నియోజకవర్గంలోని వైసిపి నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా కృషి చేయాలని సూచించారు.