Nov 17,2022 21:55

జగనన్న క్రీడా లోగో ఆవిష్కరణ
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:

జగన్న క్రీడాలోగోను జెడ్పి ఛైర్మెన్‌ శ్రీనివాసులు గురువారం జిల్లా పరిషత్‌ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న క్రీడా సంబరాలు పేరుతో ఆటలపోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జగనన్న క్రీడా సంబరాలలో కబడ్డీ, వాలీబాల్‌, బ్మాడ్మింటన్‌, క్రికెట్‌ పోటీలను తొలుత నియోజకవర్గ, జిల్లా, జోన్‌ స్థాయిలో పూర్తి చేస్తామన్నారు. డిసెంబర్‌ 20, 21 తేదీల్లో రాష్ట్రస్థాయి పోటీలు ఉంటాయన్నారు. విజేతలకు రూ.50లక్షల విలువైన బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్‌ స్పోర్ట్స్‌ అథారిటీ చీఫ్‌ కోచ్‌ బాలాజీ, బాస్కెట్‌ బాల్‌ కోచ్‌ ఉదయ కుమార్‌, రెస్లింగ్‌ కోచ్‌ రఫి, టెన్నిస్‌ కోచ్‌ శశిధర్‌ పాల్గొన్నారు.