Feb 26,2023 19:58

ప్రజాశక్తి - కాళ్ల
జగనన్న కాల నీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఎం మండల కార్యదర్శి గొర్ల రామకృష్ణ డిమాండ్‌ చేశారు. మండలంలో సిపిఎం ఆధ్వర్యంలో ప్రచార యాత్ర ఆదివారం నిర్వహించారు. ఈ నెల 27వ తేదీన తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించనున్నామని రామకృష్ణ తెలిపారు. మండలంలోని ఏలూరుపాడు, కాళ్లకూరు, కాళ్ల, కోలనపల్లి, జక్కరం గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలిచ్చారని, ఇంతవరకూ ఇళ్ల నిర్మాణం చేపట్టలేదని తెలిపారు. కాలనీల్లో రోడ్లు, విద్యుత్‌, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించకుండా, ఇళ్లు నిర్మించుకోకపోతే స్థలాలు స్వాధీనం చేసుకుంటామని పేదలను ప్రభుత్వం బెదిరించడం దారుణమన్నారు. వెంటనే మౌలిక సదు పాయాలు కల్పించి ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ యాత్రలో మండా సూరిబాబు, వాడపల్లి వెంకటేశ్వర్లు, చాట్ల వెంకటదాసి లాజరు, బాలయ్య, తిరుమాని సుబ్బారావు పాల్గొన్నారు.