నగర కమిషనర్ పి.విశ్వనాథ్
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్ : జగనన్న హౌసింగ్ కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయించాలని నగర కమిషనర్ పి.విశ్వనాథ్ హౌసింగ్ అధికారులు, వార్డు కార్యదర్శులను ఆదేశించారు. శుక్రవారం నగరపాలక కార్యాలయంలో హౌసింగ్ నిర్మాణాలపై హౌసింగ్ అధికారులు, వార్డు అమినిటీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. హౌసింగ్ కాలనీల్లో ఇంటి స్థలాలు పొందిన లబ్ధిదారులు సత్వరం ఇళ్ల నిర్మాణాలను ప్రారం భించేలా అవగాహన కల్పించాలన్నారు. వాలంటీర్లను సమన్వయం చేసుకొని లబ్ధిదారులను కలిసి వారికి అవగాహన కల్పించాలన్నారు. పునాదులు వరకు పనులు పూర్తి చేయిస్తే బిల్లులు వస్తాయని వివరించాలన్నారు. వార్డుల వారీగా హౌసింగ్ నిర్మాణాలు, పెండింగ్ అంశాలపై సమీక్షించారు. సమావేశంలో హౌసింగ్ డిఈ రామస్వామి రెడ్డి, టీపీవో మురళి కష్ణ, వార్డు అమినిటీ కార్యదర్శులు పాల్గొన్నారు.
నిబంధనల మేరకు నిర్మాణాలు
నగరంలో జరుగుతున్న నిర్మాణాలు ప్రభుత్వ నిబంధనల మేరకు జరుగేలా నిరంతరం నిఘా ఉంచి పర్య వేక్షించాలని నగర కమిషనర్ పి.విశ్వనాథ్ వార్డు ప్రణాళిక కార్యదర్శులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రణాళిక విభాగం అధికారులు, ప్రణాళిక కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. అనుమతి లేని, నిబంధనలను అతిక్రమించి జరిగే నిర్మాణాలను గుర్తించి ఎప్పటికప్పుడు నోటీసులు ఇవ్వడంతోపాటు ఉన్నతాధికారుల దష్టికి తేవాలన్నారు. సమావేశంలో ఏసీపీ రామకష్ణుడు, టీపీవో మురళి కష్ణ, ప్రణాళికా కార్యదర్శులు పాల్గొన్నారు.










