అధికారులకు సూచనలిస్తున్న గిరిషా
ప్రజాశక్తి-తిరుపతి టౌన్ : చంద్రగిరి మండలం కొత్తపల్లి వద్ద ఇళ్లు కేటాయించిన జగనన్న కాలనీల్లో ఏర్పాట్లను, జియోట్యాగింగ్ పనులను పరిశీలించారు. అన్ని బ్లాక్‌లను కలుపుతూ మొదటినుంచి చివరి వరకు 60 అడుగుల రోడ్డు ఏర్పాటు చేయాలన్నారు. ఇంజినీరింగ్, హౌసింగ్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో తమ సిబ్బందిని ఉపయోగించి జియోట్యాగింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. వాగులు వెళ్లేచోట ఇళ్లు కేటాయించి ఉంటే వారికి మరోచోట కేటాయించాలన్నారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్, మున్సిపల్ ఇంజినీర్ వెంకట్రామిరెడ్డి, అర్బన్ తహశీల్దార్ వెంకటరమణ పాల్గొన్నారు.










