మాట్లాడుతున్న నగర ఎంఎల్‌ఎ అనిల్‌కుమార్
జగనన్న ఇళ్ల నిర్మాణాలను పరిశీలన
ప్రజాశక్తి-నెల్లూరు:నగరంలోని 54వ డివిజన్ భగత్‌సింగ్ కాలనీలో 2వ నెంబరు జగనన్న లేఅవుట్‌లో నిర్మిస్తున్న ఇళ్ళ నిర్మాణాలను నగర శాసనసభ్యులు డాక్టర్ పి.అనీల్‌కుమార్ అధికారులతో కలిసి పరిశీలించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నగర నియోజకవర్గానికి సంబంధించి నిర్మిస్తున్న పది వేల ఇళ్ళ పనులు త్వరితగతిన పూర్తి చేసి డిసెంబర్ 21వ తేదీన ప్రజలకు అందించాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్నామని తెలిపారు. అనంతరం టిడ్కో ఇళ్ళలో మౌలిక సదుపాయాలు పరిశీలించి స్థానికంగా నివసిస్తున్న కుటుంబాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు షేక్ సఫియా బేగం, దేవరకొండ సుజాత, ఓబిలి రవిచంద్ర, పొట్లూరి రామకష్ణ ఆచారి, నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు షేక్ జమీర్, వైఎస్‌ఆర్‌సిపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.










