ప్రజాశక్తి - చిత్తూరు అర్బన్
జగనన్న హౌసింగ్ కాలనీలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని నగర మేయర్ ఎస్ అముద పిలుపునిచ్చారు. గురువారం మేయర్ బండపల్లి లేఅవుట్‌ను సందర్శించి, ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కల నెరవేరడం కోసం వేల సంఖ్యలో ఇంటి స్థలాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ స్థలాల్లో పక్కా గహాలను మంజూరు చేశారని, అదనంగా డ్వాక్రా సంఘాల నుంచి రుణాలు మంజూరు చేస్తున్నందున లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను చేపట్టి సొంతింటి కలను నిజం చేసుకోవాలన్నారు. కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వేగంగా చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే రోడ్ల నిర్మాణాలు పూర్తి కావొచ్చాయని.. మిగిలిన అభివద్ధి పనులు వేగంగా చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులతో మేయర్ మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.










