Mar 17,2022 15:37

ప్రజాశక్తి-పాకాల : జగనన్న గోరుముద్దలో నాణ్యత ఉండాలని మండల మండల విద్యా శాఖాధికారి బాబ్జి అన్నారు. స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో గురువారం ఆయన మండలంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు వంట వారితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంట గదిని శుభ్రంగా ఉంచుకోవాలిని, తాజా కూరగాయలను వాడాలిని, వంట వారు చేతికి గ్లౌసులు వేసుకోవాలిని అన్నారు. వంటకు వాడే నూనె మేలు రకం ఉండేటట్లు చూడాలిని, కోడిగుడ్లు, చిక్కిలు తీసుకొనేటప్పుడు బాగా ఉండే వాటిని తీసుకోవాలిని, పాడైన వాటిని తీసుకోకూడదు అని అన్నారు. ప్రతి రోజు ప్రధానోపాధ్యాయులు మధ్యాహ్న భోజనం పోటోలను ఐ ఎం ఎం ఎస్ అనే యాప్ లో అప్లోడ్ చేయాలన్నారు. ప్రతి రోజు ఉపాధ్యాయులు మిడ్ డే మీల్స్ ను రుచి చూడాలన్నారు.విద్యార్థులకు త్రాగడానికి మంచి నీళ్ల సౌకర్యం కల్పించాలని అన్నారు. ప్రధానోపాధ్యాయులు చాలా బాధ్యత గా ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వంట వారు, సి.ఆర్.పి.లు పాల్గొన్నారు.