Oct 16,2023 19:39

అర్జీలు స్వీకరిస్తున్న డిఆర్‌ఒ

ప్రజాశక్తి -నెల్లూరు :జగనన్నకు చెబుదాం (స్పందన) కార్యక్రమానికి ప్రజల నుంచి అందే అర్జీలు మళ్లీ మళ్లీ పునరా వతం కాకుండా సంతప్తికరస్థాయిలో, సకాలంలో పరిష్కరించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌. కూర్మ నాథ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని కలెక్టరేట్‌ తిక్కన ప్రాంగణంలో జెసి ఆర్‌.కూర్మనాథ్‌, డిఆర్‌ఒ వెంకట నారా యణమ్మ, డిఆర్‌ డిఎ పీడీ సాంబశివారెడ్డి, జెడ్‌పి సిఇఒ చిరంజీవితో కలిసి జగనన్నకు చెబుదాం.. కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మెప్మా, ఐసిడిఎస్‌ పీడీలు రవీంద్ర, హేనా సుజన్‌, హౌసింగ్‌ పీడీ నాగరాజు, బీసీ, మైనారిటీ, ఎస్సీ, ట్రైబల్‌ వెల్ఫేర్‌ అధికారులు వెంకటయ్య, నిర్మలాదేవి, రమేష్‌, పరిమళ, సర్వే రికార్డుల ఏడి హనుమాన్‌ ప్రసాద్‌, డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు, డి సి హెచ్‌ ఎస్‌ రమేష్‌ నాథ్‌, ఉన్నారు.