జగనన్న ఆరోగ్య సురక్షతో మెరుగైన వైద్యసేవలు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంతో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుతుందని నగర మేయర్ ఎస్.అముద తెలిపారు. సోమవారం 39వ వార్డులో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష సర్వే కార్యక్రమాన్ని మేయర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే బందం మేయర్‌కు ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఇంటి వద్దకే వెళ్లి ప్రజల ఆరోగ్యస్థితిని తెలుసుకొని, మెరుగైన వైద్య సేవలు అందేలా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం మేయర్ స్థానిక నేతాజీ వీధిలో పర్యటించారు. పారిశుద్ధ్యం, రోడ్ల మరమ్మతులపై అధికారులకు సూచనలు ఇచ్చారు.










