Oct 19,2023 19:05

కిట్‌ అందిస్తున్న మున్సిపల్‌ కమీషనర్‌ మనోహర్‌

ప్రజాశక్తి-కందుకూరు :రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కందుకూరు గుర్రం వారి పాలెం సచివాలయం పరిధిలో ఉన్న ప్రజలకు గురువారం శిబిరం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా జె సి యస్‌ కో ఆర్డినేటర్‌ ముప్పవరపు కిషోర్‌ మాట్లాడుతూ ప్రజలందరికి ఆరోగ్యం చేకూరాలని సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అమలు చేస్తున్నారు అని అన్నారు. క్యాంపు నందు జనరల్‌ వైద్య నిపుణులు స్త్రీల వైద్య నిపుణులు కంటి వైద్య నిపుణులు అవసరమైన పరీక్షలు నిర్వహించి చికిత్సలు చేస్తున్నారు. తగిన మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. శాసనసభ్యులు మానుగుంట మహిధరరెడ్డి పర్యవేక్షణలో సచివాలయం వారిగా ఆరోగ్య సురక్ష క్యాంపు లు ప్రజలందరికి అందుబాటులో వుండే విధంగా మున్సిపల్‌ కమిషనర్‌ మనోహర్‌ ఏర్పాటు చేయటం ద్వారా సచివాలయం పరిధిలో ప్రజలు క్యాంపులు విరివిగా వినియోగించుకుంటున్నారు. ఆరోగ్య శిబిరాలు వద్ద ఏర్పాటు చేసిన వివిధ రకాల బలవర్థకమైన పౌష్టికాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని అంగన్వాడీ కార్యకర్తలు ఆధ్వర్యంలో స్టాల్స్‌ ఏర్పాటు చేసి వివరిస్తున్నారు. ఈకార్యక్రమంలో సచివాలయం కన్వీనర్లు షేక్‌ మస్తాన్‌ బాషా, మల్లీశ్వరి, షేక్‌ పకద్ధీన్‌ ఆలీ అహ్మద్‌ ,గహ సారథులు వాలంటీర్లు మున్సిపల్‌ డి.యీ రమేష్‌, అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ వైద్యులు ఆశావర్కర్లు ఏ యన్‌ యం లు తదితరులు పాల్గొన్నారు.చార్జీలకి వ్యతిరేకంగా బ్యాలెట్‌