జగనన్న ఆరోగ్య సురక్షతో అందరికీ వైద్యం
ప్రజాశక్తి-జలదంకి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంతో అందరికీ వైద్య సేవలు అందుతున్నాయని ఎంపిడిఒ శ్రీధర్‌బాబు తెలిపారు. సోమవారం చామదల పంచాయితీ సచివాలయ ఆవరణంలో సర్పంచ్ పలుకూరి సీతారామమ్మ అధ్యక్షతన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీ పరిధిలోని పలువురు శిబిరానికి వచ్చి డాక్టర్ల వద్ద చూపించుకొని ఉచితంగా మందులను తీసుకెళ్లారు. అంగన్వాడీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన పౌష్టిక ఆహారం గురించి తెలియజేస్తూ స్టాల్ నుఏర్పాటు చేశారు. గర్భిణులకు, చిన్నారులకు, కిశోర బాలికలకు ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను తెలియజేస్తూ, గర్భిణులకు పౌష్టికాహార కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నేతలు పసుపులేటి ప్రసాదు, సచివాలయ కన్వీనర్ వంటేరు చిన్న లక్ష్మీ నర్సారెడ్డి, కోటి రెడ్డి, పలుకూరి రవిచంద్ర, ఎంఇఒ-2 నాగేశ్వరరావు, మండల కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఆర్ సోమేశ్వరరావు, జలదంకి పిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్ ఎ.శ్రీనివాసులు, గట్టుపల్లి పిహెచ్‌సి వైద్య అధికారిని డాక్టర్ జె.పద్మజ, డాక్టర్ సుజిత్, (కావలి ఏరియా హాస్పిటల్) చిన్న పిల్లల వైద్యులు డాక్టర్ రెడ్డి రాజేష్(నారాయణ హాస్పిటల్ నెల్లూరు) ఎన్ హరిప్రసాద్ హెల్త్ ఎడ్యుకేటర్, పంచాయతీ కార్యదర్శి బుజ్జమ్మ, వలంటీర్లు, మెడికల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.










