జగనన్న ఆరోగ్య సురక్ష తనిఖీ
ప్రజాశక్తి -పలమనేరు: పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కాకా తోపు , పాతపేట లోని టీఎస్ అగ్రహారం సచివాలయ పరిధిలోని గడ్డూరు గ్రామం, కాకా తోపు లో సబ్ యూనిట్ అధికారి జయశంకర్ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని శుక్రవారం తనిఖీ చేశారు. ఇందులో కాకా తోపు పరిధిలో ఈనెల 30వ తేదీ జరిగే మెడికల్ క్యాంపు, 17వ తేదీ మెడికల్ క్యాంపు లు నిర్వహిస్తారని ప్రతి ఏఎన్‌ఎం తప్పనిసరిగా ప్రతి గహాన్ని సందర్శించి ప్రతి ఒక్కరికి బిపి, షుగరు, యూరిన్ పరీక్షలు, రక్త పరీక్షలు చేసి వాటి నివేదికలను యాప్ లో అప్లోడ్ చేయాలని వారికి సూచించారు. ఇందులో దీర్ఘకాలిక వ్యాధులు, నరాలకు సంబంధించిన వ్యాధులు, కంటికి సంబంధించిన వ్యాధులు క్షుణ్ణంగా పరీక్ష చేసి వారిని మెడికల్ క్యాంపునకు వచ్చేలా స్లిప్పు ఇవ్వాలని సూచించారు. వ్యాధిగ్రస్తులు తప్పకుండా క్యాంపు స్థలం రిఫరెన్స్ స్లిప్పులను తప్పకుండా తీసుకుని రావాలని సూచిం చారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే ఫ్రైడే పాటించాలని ఇంటి లోపల ఇంటి బయట మంచినీరు నిల్వ లేకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని, మలేరియా డెంగ్యూలేని పలమనేరు మున్సిపాలిటీగా తీర్చిదిద్దుటలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వహించాలని ప్రజలకు సూచించారు. మెడికల్ క్యాంపునకు ఏదైనా సందేహాలు ఉంటే ఆరోగ్య సిబ్బందిని సంప్రదించాలని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, ఏఎన్‌ఎం సుజాత, సుభాషిని, ఆశా వర్కర్లు నీలా, పద్మమ్మ, , జగదీశ్వరి పాల్గొన్నారు.










