Sep 19,2023 21:19

జగనన్న ఆరోగ్య సురక్ష సర్వే
పకడ్బందీగా నిర్వహించాలి
డిఎం అండ్‌హెచ్‌ఒ ప్రభావతిదేవి
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:

చిత్తూరు నగర పరిధిలోని కాజూరు అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో మంగళవారం అంబేద్కర్‌నగర్‌లో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్నిజిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఓ ప్రభావతి దేవి ఆకస్మిక తనిఖీ చేశారు. ఇంటింటి సర్వేలో భాగంగా ఏడు రకాల పరీక్షలపై ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ అర్బన్‌ హెల్త్‌సెంటర్‌ పరిధిలో జరిగే స్పెషల్‌ డాక్టర్ల మెడికల్‌ క్యాంప్‌కు సంబంధించి అనారోగ్య బాధితులకు జగనన్న ఆరోగ్య సురక్ష టోకన్స్‌ పంపిణీ చేశారు. టోకన్స్‌లో తెలిపిన తేదీ ప్రకారం స్పెషల్‌ మెడికల్‌ క్యాంపుకు విచ్చేసి అన్నిరకాల పరీక్షలు చేసుకుని తగిన చికిత్స చేయించుకోవాలని తెలిపారు. అత్యవసరమైతే ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్‌ ఆసుపత్రికి రెఫర్‌ చేయడం జరుగుతుందన్నారు. ఈ అద్భుత అవకాశాన్ని ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో పీహెచ్‌సిలకు బీపీ ఆపరేటర్లు, ఆక్స్టోమీటర్‌, థర్మామీటర్లు పంపిణీ చేయడమైందన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ శిరీష హెచ్‌డబ్ల్యూసి, స్థానిక వైద్యాధికారి, సూపర్వైజర్‌, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.