Oct 26,2023 19:43

ఆరోగ్య సురక్ష కిట్‌ను అందజేస్తున్న దృశ్యం

ఆరోగ్య సురక్ష కిట్‌ను అందజేస్తున్న దృశ్యం
జగనన్న ఆరోగ్య సురక్ష ప్రజలకు వరం
ప్రజాశక్తి ఆత్మకూరు అర్బన్‌:పేదల చెంతకే వైద్య సేవలను తీసుకొచ్చి ధనవంతులతో సమానంగా పేదవాడికి మెరుగైన వైద్యాన్ని అందించాలన్న లక్ష్యంతో జగన్మోహన్‌ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ఆత్మకూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గోపారం వెంకటరమణమ్మ అన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా గురువారం ఆత్మకూరు పురపాలకసంఘం నందలి ఎసిఎస్‌ఆర్‌ సచివాలయం 17,19,20వ వార్డునకు సంబంధించిన మెడికల్‌ క్యాంపు అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌లో మున్సిపల్‌ చైర్పర్సన్‌ కుమారి గోపారం వెంకటరమణమ్మ అధ్యక్షతన ప్రారంభం కావడం జరిగింది. పై కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ బి.నాగేశ్వర రావు మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష పేదల పాలిట ఒక వరము లాంటిదన్నారు.కార్యక్రమంలో, మెడికల్‌ ఆఫీసర్‌ షేక్‌ అస్మా , మున్సిపల్‌ వైస్‌ ఛైర్మెన్‌ షేక్‌ సర్దార్‌, వార్డు కౌన్సిలర్లు కొండా స్వరూప రాణి , సుర భాస్కర్‌ రెడ్డి, కొప్పోలు రమాదేవి, వైసిపి నాయకులు షేక్‌ జమీర్‌ బాషా, తదితరులు పాల్గొన్నారు.