జగనన్న ఆరోగ్య సురక్ష ప్రారంభం
ప్రజాశక్తి-మర్రిపాడు : మండలంలోని నందవరం సచివాలయంలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని ఎంపిడిఒ నాగమణి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక వైద్యాధికారి డాక్టర్ గోపినాధ్ మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరంలో ఊపిరితిత్తులు, గుండె, మహిళలకు ప్రత్యేక స్పెషలిస్టు మహిళా డాక్టర్లు, కంటి పరీక్షలు, బిపి, సుగర్ పలు రకాలు వైద్యపరీక్షలు నిర్వహించామన్నారు. వైద్య పరీక్షలు అనంతరం ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం అన్ని సచివాలయాల్లో ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఆరోగ్య సురక్ష పథకంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వైద్యపరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్ సుబ్బిరెడ్డి, భీమవరం సొసైటీ చైర్మన్ మాధవరెడ్డి, సీనియర్ నాయకులు జి.శ్రీనివాసులు నాయుడు, మాజీ ఎంపిపి కోనంకి శ్రీనివాసులు నాయుడు, స్థానిక సర్పంచ్ గాలిబోయిన చిన్నక్క, ఎంపిటిసి నూనె ప్రసాద్, వైసిపి నాయకులు గాలిబోయిన రామ్మోహన్, సచివాలయ కన్వీనర్ ఖాదర్‌బాషా, ఒంటెద్దు కృష్ణారెడ్డి, పెగళ్లపాడు సర్పంచ్ చెవుల శ్రీనివాసులుయాదవ్, ఇఒపిఆర్‌డి మస్తాన్ ఖాన్, వైద్య, ఐసిడిఎస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.










