Oct 25,2023 22:36

మెళియాపుట్టి: వైద్యులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రెడ్డి శాంతి

ప్రజాశక్తి- మెళియాపుట్టి:  జగనన్న ఆరోగ్య సురక్ష పేదలకు వరమని స్థానిక ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. మండలంలోని పట్టుపురం గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. అనారోగ్యంతో బాధపడే వారికి కావాల్సిన పరీక్షలు, మందులు అందించడంతో పాటు ఆపరేషన్లు చేయాల్సి వస్తే అందుకు తగిన సహకారం ప్రభుత్వం అందిస్తుందన్నారు. దేశంలో ఎక్కడా ఇటువంటి కార్యక్రమం జరగడం లేదని ఒక ఆంధ్రప్రదేశ్‌ లోనే జరుగుతుందన్నారు. అనంతరం ఐసిడిఎస్‌ ఏర్పాటుచేసిన పౌష్టికాహార స్టాళ్లను తిలకించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ పి.సరోజిని, ఎంపిడిఒ పి.చంద్రకుమారి, ఎంఇఒ ఎం.పద్మనాభం, ఎంపిపి ప్రతినిధి బి.ఉదరు కుమార్‌, జెడ్‌పిటిసి గూడ ఎండయ్య, పిఎసిఎస్‌ అధ్యక్షులు ఉర్లన బాలరాజు, మండల వైసిపి కన్వీనర్‌ పల్లి యోగి, స్థానిక సర్పంచ్‌ ఎస్‌.లక్ష్మి, వైద్యాధికారులు హేమంత లక్ష్మి, పావని, సర్పంచ్‌లు, సచివాలయ సిబ్బంది, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
జలుమూరు: మండలంలోని కరవంజ ఆదర్శ పాఠశాలలో బుధవారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కృష్ణదాస్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి వాన గోపి, కర్వంజా సర్పంచ్‌ జుత్తు నేతాజీ, వైసిపి నాయకులు పైడి విఠల్‌రావు, జలుమూరు పిహెచ్‌సి వైద్యాధికారి తాడేల శ్రీకాంత్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
నందిగాం: నందిగాంలో సర్పంచ్‌, జెసిఎస్‌ మండల కన్వీనర్‌ జడ్యాడ రమణమ్మ, జయరాం ఆధ్వర్యంలో నిర్వహించిన జనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని రాష్ట్ర కళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ పేరాడ తిలక్‌, ఎంపిపి నడుపూరు శ్రీరామమూర్తి ప్రారంభించారు. కార్యక్రమంలో పిఎసిఎస్‌ అధ్యక్షులు కురమాన బాలకృష్ణారావు, నందిగాం మండల వైసిపి అధ్యక్షులు తమిరి ఫాల్గుణరావు, ఎంపిటిసి అంబోడి విష్ణు, మండల పరిషత్‌ ప్రత్యేక ఆహ్వానితులు చిన్ని జోగారావు యాదవ్‌, ఎంపిడిఒ శివప్రసాద్‌, డిటి ధనలక్ష్మి, వైద్యాధికారులు అనిత, సర్పంచ్‌లు బొమ్మాళి గున్నయ్య, తమిరె దేవేంద్ర, కవిటి ఎర్రన్న, సంబాన దానయ్య, ఆశ వర్కర్లు అంగన్వాడి కార్యకర్తలు, వాలంటీర్లు పాల్గొన్నారు.
వజ్రపు కొత్తూరు: పాతటెక్కలిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ బి.అప్పలస్వామి, సర్పంచ్‌ తుంగాన సుశీల, వైసిపి నాయకులు కొల్లి జోగారావు, ఇఒపిఆర్‌డి దిక్కళ తిరుమలరావు, మహిళా సమాక్య అధ్యక్షులు జల్లు ఉషారాణి, స్త్రీ వైద్య నిపుణులు ఐశ్వర్య, రాజ్యలక్ష్మి, సుధీర్‌ కుమార్‌, ప్రత్యూష, వైద్య సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.
పోలాకి: బెలమర పాలవలస పంచాయతీలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి ధర్మాన కృష్ణచైతన్య, ఎంపిపి ప్రతినిధి ముద్దాడ బైరాగి నాయిడు, వైసిపి మండల కన్వీనర్‌ కణితి కృష్ణారావు, సర్పంచ్‌ ప్రతినిధి చింతు రాఘవరావు, చింతు సింహాచలం, వైసిపి నాయకులు ఆర్‌.త్రినాథరావు, కణితి సత్తిబాబు, చింతాడ ఉమ, లండ యర్రయ్య, చింతాడ వెంకటరావు, కె.లక్ష్మణరావు, ఎంపిడిఒ ఉషశ్రీ, డిటి శ్రీనివాసరావు, విఆర్‌ఒ వై.ప్రవీణ్‌ కుమార్‌, వైద్యులు రత్నంరాజు, చందనం తదితరులు పాల్గొన్నారు.
పొందూరు: మహాత్మ జ్యోతిభా పూలే గురుకుల పాఠశాల ఆవరణలో తాడివలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్యసురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 320 మందికి వైద్య పరీక్షలు జరిపి మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ సీపాన హరిహరరావు, ఇఒపిఆర్‌డి సింహాచలం, వైసిపి మండల జెసిఎస్‌ బాడాన వెంకట కృష్ణారావు, వైసిపి రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి బండారు జై ప్రతాప్‌ కుమార్‌, వైసిపి పట్టణ అధ్యక్షులు గాడు నాగరాజు, ఉపసర్పంచ్‌ అనకాపల్లి గోవిందరావు, పంచాయతీ ఇఒ రమేష్‌, వైద్యాధికారులు సాగరిక, శివశంకర్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
కోటబొమ్మాళి: మండలంలో లఖందిడ్డి పంచాయతీ పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళింగ కార్పోరేషన్‌ చైర్మన్‌ పేరాడ తిలక్‌, మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణిలు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపిపి రోణంకి ఉమామల్లేశ్వరరావు, ఎంపిడిఒ కె. ఫణీంద్రకుమార్‌, మండల వైసిపి అధ్యక్షుడు నూక సత్యరాజు, స్థానిక సర్పంచ్‌ బమ్మిడి గణపతి, ఎంపిపి దుక్క రోజారామకృష్ణ, ఎంపిటిసిలు బొడ్డు అప్పన్న, హనుమంతు గోవిందరావు, వైసిపి నాయకులు పేడాడ వెంకటరావు, సింగుపురం వినోద్‌, మండల విద్యాశాఖాధికారి ఎల్‌.వి.ప్రతాప్‌, అంగన్వాడీ సిబ్బంది, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.