Oct 17,2023 21:43

ఫొటో : సురక్ష కార్డులను పంపిణీ చేస్తున్న ఎంపిపి తూమాటి విజయభాస్కర్‌ రెడ్డి

జగనన్న ఆరోగ్య సురక్ష పేదలకు వరం
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ (చేజర్ల) : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను ఏర్పాటు చేశారని, ప్రజలందరూ ఆరోగ్యమే మహాభాగ్యంగా భావించి ఈ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని చేజర్ల ఎంపిపి తూమాటి విజయభాస్కర్‌ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని మడపల్లి గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపిపి జగనన్న ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఆరోగ్య సురక్ష క్యాంపులో ఆరోగ్య సేవలను పరిశీలించి, అక్కడ అందించే పలు రకాల మందులు, టెస్ట్‌ల గురించి వైద్యులను, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషకార స్టాల్‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మద్దాల వెంకటమ్మ, ఉపసర్పంచ్‌ పూనూరు మాలకొండారెడ్డి, ఎంపిటిసి భారతి, జెసిఎస్‌ కన్వీనర్‌ పూనూరు బాలగంగాధర్‌ రెడ్డి, అడ్రా వెంకట రెడ్డి, ఇనకళ్లు భాస్కర్‌ రెడ్డి, అధికారులు, డాక్టర్లు, సచివాలయం సిబ్బంది, కన్వీనర్లు, గృహ సారథులు, వలంటీర్లు పాల్గొన్నారు.