Oct 19,2023 17:17

వద్ధులతో మాట్లాడుతున్న సుధీర్‌ రెడ్డి

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :ఆరోగ్యం అనే మహా భాగ్యన్ని ప్రజలకు అంది వ్వాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ముఖ్య ఉద్ధేశ్యం అని వైసిపి రాష్ట్ర కార్యదర్శి చిల్లకూరు సుధీర్‌ రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండలంలోని పోట్లపూడి గ్రామంలో జగనన్న ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఎంపిడిఒ కన్నం హేమలత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సు ధీర్‌ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సర్పంచ్‌ చిల్లకూరు ప్రసూనమ్మ, తహశీల్దార్‌ లావణ్య, ఎంపీడీ వో హేమలత, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.