ప్రజాశక్తి-కందుకూరు :రాష్ట్రంలో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష సేవలు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఆరోగ్య నిపుణులు చేత పలురకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. స్థానిక సచివాలయం 10 బూడిద పాలెం పరిధిలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఈరోజు జరిగిన క్యాంపు లో జె సి యస్ కో ఆర్డినేటర్ ముప్పవరపు కిషోర్ పాల్గొని మాట్లాడారు. పట్టణ పరిధిలోని క్యాంపు ను మున్సిపాలిటీ కమిషనర్ మనోహర్ , డాక్టర్ బ్యూలా గ్రేసి సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు వైద్య పరీక్షలు మందులు అందుబాటులో ఉంచారు. టి.పిఒ శ్రీనివాస రావు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ వాలంటీర్ల కన్వీనర్లు గహ సారథులు పాల్గొన్నారు. క్యాంపులో పౌష్టికాహారం వివరించే స్టాల్స్‌ను అంగన్‌వాడీ కార్యకర్తలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. వివిధ రకాల బలవర్థకమైన ఆహార పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలో వివరించి చెప్పడం స్టాల్ సందర్శనకు వచ్చిన వారిని ఆకర్షించాయి.










