Oct 17,2023 19:10

మాట్లాడుతున్న కిషోర్‌

ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు సచివాలయం - 7 తూర్పు వడ్డి పాలెం పరిధిలో మంగళవారం కందుకూరు అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ay జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరం నిర్వహించారు. జె సి యస్‌ కో ఆర్డినేటర్‌ ముప్పవరపు కిషోర్‌ మాట్లాడారు. ప్రతి ఇంటికి వైద్య సేవలు అందించే లక్ష్యంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరుగుతుందన్నారు. సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపాలిటీ కమిషనర్‌ మనోహర్‌ డాక్టర్‌ బ్యూలా గ్రేసి సమర్థవంతంగా నిర్వహించారు. వివిధ రకాల వైద్య నిపుణులు పాల్గొన్నారు. సచివాలయం కన్వీనర్లు గహ సారథులు వాలంటీర్లు ఉన్నారు.