మాట్లాడుతున్న ఎంపీపీ కేత వేణుగోపాల్ రెడ్డి
జగనన్న ఆరోగ్య సురక్ష
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్:జగనన్న ఆరోగ్య సురక్ష పేదలకు ఓ వరమని ఎంపీపీ కేత వేణుగోపాల్ రెడ్డి అన్నారు.గురువారం మండలంలోని వెన్న వాడలో ప్రజలకోసం ప్రతిష్ఠాత్మకంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపును సర్పంచ్ జగన్నాథం, లక్ష్మమ్మ ప్రారంభించారు. స్థానిక వైసీపీ నాయకులు జగన్నాథం ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సురక్ష క్యాంపునకు హాజరైన ఎంపీపీ కేతా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఆరోగ్య సురక్ష క్యాంపులో ఆరోగ్య సేవలను పరిశీలించి, అక్కడ అందించే పలు రకాల మందులు, టెస్ట్ ల గురించి వైద్యులను, సిబ్బందిని అడిగి తెలుసు కున్నారు. ఐసిడిఎస్ వారు ఏర్పాటు చేసిన పోషకార స్టాల్‌ను పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో ఎంపీడీఓ ఐజాక్ ప్రవీణ్, వైస్ ఎంపీపీ కంభంశెట్టి ప్రమీల, సర్పంచ్ నరసింహులు, పరిశీలకులు ఓ.కష్ణారెడ్డి, ఎన్. ప్రసాద్, స్థానిక నాయకులు దాడి శ్రీనివాసులు నాయుడు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.










