Oct 12,2023 17:23

ఆరోగ్య శిబిరంలో ఏడిఎం అండ్‌ హెచ్‌ఒ డాక్టర్‌ ఖాదర్‌ వల్లి

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :జగనన్న ఆరోగ్య సురక్ష వినూత్న కార్యక్రమం అని, దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్‌ డిఎం అండ్‌ హెచ్‌ఒ డాక్టర్‌ ఖాదర్‌ వల్లి సూచించారు. ఇఒపిఆర్‌డి నారాయణ రెడ్డి అధ్యక్షతన తోటపల్లిగూడూరు మండలం. చిన్నచెరుకూరు గ్రామంలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. డాక్టర్‌ ఖాదర్‌వల్లి మాట్లాడుతూ ఇటీవల 'జగ నన్న సురక్ష' ద్వారా నేరుగా అ ధికారులే ఇంటికి వచ్చి వివరా లు సేకరించి అవసరమైన సర్టి ఫికెట్లు గ్రామ సభల్లో అందించినట్లు అయన తెలిపారు. సర్పంచ్‌ ఉ య్యాల భాస్కర్‌, ఎంఇఓ -2 జయరామ నాయుడు, వైసీపీ నాయకులు, ఆరోగ్య సురక్ష స ర్వే వైద్య సిబ్బంది, తదితరు లు పాల్గొన్నారు.