ప్రజాశక్తి - లింగసముద్రం :మండలంలోని ముత్యాలపాడు సచివాలయం పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో 410 మంది హాజరయ్యారు. నలుగురు డాక్టర్ల ద్వారా అన్ని పరీక్షలు నిర్వహించి తగిన మందులు అందజేశారు. 20 మందికి పై ఆస్పత్రులకు సిఫార్సు చేశారు. లింగసముద్రం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రమేష్, డాక్టర్ అనురాధ, డాక్టర్ వెంకటేష్, డాక్టర్ షాజుద్ధీన్, డాక్టర్ శ్రావణి వైద్యపరీక్షలు నిర్వహించారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని అన్ని సచివాల యంలోని మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్స్,ఆరోగ్య కార్యకర్తలు,పర్యవేక్షకులు,ఆశా కార్యకర్తలు, పాల్గొన్నారు.సర్పంచ్ చెంచులక్ష్మి ఏర్పాట్లు చేశారు. తహశీల్దార్ ప్రసాద్, ఎంపిడిఓ శేషుబాబు, ఎంపిటిసి కన్నే వెంకమ్మ, వైసిపి నాయకులు మల్లేబోయిన వెంకటేశ్వర్లు, కన్నే రాజారావు, సచివాలయం కన్వీనర్లు వట్టిగుంట వెంకటేశ్వర్లు, మల్లేబోయిన బుల్లియ్య, కనపర్తి మాలకొండయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ యల్లావుల మాధవ పాల్గొన్నారు.










