Oct 07,2023 20:09

నిరసన దీక్షలో పాల్గొన్న నాయకులు

నిరసన దీక్షలో పాల్గొన్న నాయకులు
జగన్‌కి తగిన బుద్ధి చెబుదాం
ప్రజాశక్తి-నెల్లూరు అర్బన్‌ :27 రోజుల నుంచి అక్రమ కేసులు బనాయించి సిఐడిని అడ్డుపెట్టుకొని టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుని అరెస్టు చేయించిన జగన్‌ ప్రభుత్వాన్ని 2024 సాధారణ అసెంబ్లీ ఎన్నికలలో తగిన బుద్ధి చెప్పి తాడేపల్లి పరిమితం చేయాలని కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా రిలే నిరాహార దీక్షను టిడిపి శ్రేణులు నిర్వహించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ ఎటువంటి ఆధారాలు లేనప్పటికీ చర్యల్లో భాగంగా జైల్లో బంధించారని మూడు దఫాలు సిఎంగా ఉన్న చంద్రబాబును అపార అనుభవం ఉన్న రాజకీయ నాయకుడును సాధారణ ఖైదీగా ఎటువంటి సౌకర్యాలు కల్పించకుండా ఏసీ లేదు పరుపు లేదు కనీసం హాట్‌ వాటర్‌ కూడా ఇవ్వకుండా కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు.
వారు ఎన్ని కుయుక్తులు పండిన చివరకు న్యాయమే గెలుస్తుందన్నారు. కడిగిన ముత్యం లాగా చంద్రబాబు నాయుడు బయటకు వస్తారని ఆశాభవాన్ని వ్యక్తం చేశారు. సాయంత్రం ఏడు గంటలకు కాంతిలో క్రాంతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో విద్యుత్‌ దీపాలు ఆపివేసి ఐదు నిమిషాల పాటు క్యాండిల్స్‌ వెలిగించి గుమ్మాల వద్ద నిలబడి నిరసన తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో 10వ డివిజన్‌ ఇన్‌ఛార్జ్‌ తిరుమల నాయుడు మూడో డివిజన్‌ ఇన్‌ఛార్జ్జ్‌్‌ కొత్తూరు శైలజమ్మ, టిడిపి సిటీ మహిళా అధ్యక్షురాలు కమ్మ కళ్యాణి, పార్లమెంట్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ, ఏడవ డివిజన్‌ ఇన్‌ఛార్జ్‌ దాసరి వేణుగోపాల్‌, కపిర రేవతమ్మ, మహిళా విభాగం పాల్గొన్నారు.