Oct 24,2023 18:54

జగనాసర దహన కార్యక్రమంలో పాల్గొన్న ఇంటూరి

ప్రజాశక్తి-కందుకూరు :చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా జగనాసుర దహనం కార్యక్రమాన్ని కందుకూరు పట్టణంలోని గుర్రంవారి పాలెంలో సోమవారం రాత్రి నిర్వహించారు. కందుకూరు నియోజకవర్గం టిడిపి ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సైకో పోవాలి.. అని రాసి ఉన్న కాపీలను దహనం చేశారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వైసిపి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ తమ నాయకుడు చంద్రబాబు గారిని అరెస్టు చేస్తే కనీసం నిరసన తెలిపే అవకాశం ఇవ్వకుండా జగన్మోహన్‌ రెడ్డి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు దామా మల్లేశ్వర రావు, పట్టణ ఉపాధ్యక్షుడు వడ్డెళ్ళ రవిచంద్ర, వార్డు అధ్యక్షుడు గుర్రం మాల్యాద్రి, వార్డు నాయకులు గుర్రం మల్లికార్జున, పూనాటి మాధవరావు, మల్లికార్జున, శ్రీకాంత్‌, తలపనేని నవీన్‌, గుర్రం మధుబాబు, పూనాటి సుబ్బారావు, గుర్రం నరసింహారావు, గుర్రం మనోహర్‌, పార్టీ నాయకులు షేక్‌ సలాం, ముచ్చు వేణు, గొంది నర్సింగరావు, భవనాసి వెంకటేశ్వర్లు, పసుపులేటి శ్రీను, కోటపూరి శ్రీను ఉన్నారు.