
ప్రజాశక్తి- కంచిలి: రాష్ట్రంలో నాలుగున్నరేళ్ళ జగన్ పాలనంతా అరాచకమేనని ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ అన్నారు. మండలంలో ఒరియా నారాయణపురం గ్రామంలో సోమవారం భవిష్యత్‌కు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం అరాచక పాలన కొనసాగుతుందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమంగా కేసులు పెట్టడం, బెదిరింపులకు పాల్పడడమే జరుగుతుందన్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. మీ బిడ్డల భవిష్యత్ బాగుండాలంటే రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడును సిఎం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు మాదిన రామారావు, జగదీష్ పట్నాయక్, టివి రమణ, బంగారు, రమేష్, రవి, ఎం.పట్నాయక్, శోభన్ పాల్గొన్నారు.
కొత్తూరు: మండలంలో గొట్టిపల్లి పంచాయతీలో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా సోమవారం డిటిపి రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్ ఇంటింటికి వెళ్లి మినీ మేనిపెస్టోకు సంభంధించి కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు జి.కమలాకర్, బి.గోవిందరావు, సవర మోహనరావు, పి.గోవిందా, రవికుమార్ పాల్గొన్నారు.
ఆమదాలవలస: మండలంలో మునగవలస గ్రామంలో బాబు ష్యూరిటీ భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కోరుకొండ వెంకటరమణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.