Oct 22,2023 18:07

కరపత్రాలు పంపిణీ చేస్తున్నా ఇంటూరి నాగేశ్వరరావు

ప్రజాశక్తి-కందుకూరు :జగన్మోహన్‌ రెడ్డి ఏలుబడిలో రాష్ట్రంలో దివాలా అంచుకు చేరిందని, చేతగాని వ్యక్తికి పగ్గాలు అప్పగిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని కందుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా కందుకూరు పట్టణంలోని 18వ వార్డులో ఆదివారం బాబుతో నేను కార్యక్రమం జరిగింది. నాగేశ్వరరావుతో పాటు పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాజీ ఎంఎల్‌ఎ డాక్టర్‌ దివి శివరాం సహా పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ అప్పు తీసుకురాకుండా ప్రభుత్వ బండి నడిచే పరిస్థితి లేదన్నారు. లక్షల కోట్లు అప్పు తెస్తున్నా అభివద్ధి ముందుకు సాగడం లేదని, తెచ్చిన సొమ్మంతా ఏమైపోతుందో అర్థం కావడం లేదన్నారు. దివి శివరాం మాట్లాడుతూ చంద్రబాబును జైల్లో పెట్టిన విధానం, ఆయన పట్ల వైసిపి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే గుండె తరుక్కుపోతోందన్నారు. సుదీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి తెలుగు రాష్ట్రాలను అభివద్ధి పధంలో నడిపిన చంద్రబాబు నాయుడు పట్ల ఇంత కక్షపూరితంగా వ్యవహరించడం దారుణమన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి సహకరించాలని ఆయన కోరారు. పట్టణ ప్రధాన కార్యదర్శి ముచ్చు శీను, వార్డు అధ్యక్షుడు నగర జయకష్ణ, స్థానిక నాయకులు పువ్వాడి రమణయ్య, ఈదర రవణమ్మ, సయ్యద్‌ జియావుద్దీన్‌, రావి జాలయ్య, ఓరుగంటి రమణయ్య, గనిపినేని మల్లికార్జున, ఓరుగంటి శేషారావు, చిడిపోతు కోటేశ్వరరావు, చిడిపోతు రామానాయుడు, సారధి, కేశినేని వెంకటేశ్వర్లు, జొన్నలగడ్డ బాబు, రావి వెంకటేశ్వర్లు, చిమ్మిరి రామచంద్ర ప్రసాద్‌, వడ్డెళ్ళ మాధవ, వడ్డేళ్ళ వెంకట్రావు, నల్లూరి సింగయ్య, అత్తోట మాల్యాద్రి, దివి శ్రీధర్‌, ఉన్నం కష్ణమోహన్‌, దివి శ్రీనివాసరావు (బుజ్జి), పిడికిటి రఘు, బెల్లం వెంకటేశ్వర్లు, దివి వెంకటేశ్వర్లు, దివి కొండయ్య, అమర రామలింగయ్య ఉన్నారు.