జెవివి జిల్లా అధ్యక్షులుగా ప్రొపెసర్ నాగేశ్వరావు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: జెవివి జిల్లా నూతన కార్యవర్గన్ని ఆదివారం స్థానిక విజయం డిగ్రీ కళాశాల్లో నిర్వహించిన 17వ జనవిజ్ఞానవేదిక 17వ ప్టీనరీ వార్షిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కామన్ సైన్సు అండ్ టెక్నాలజీ ఫర్ కామన్ పీపుల్ అనే అంశంపై ప్రముఖ అంతర్జాతీయ శాస్త్రవేత్త కొరియా నాసా సంస్థలో పనిచేస్తున్న డాక్టర్ సుంకర్ ఈశ్వర్ ఆన్‌లైవ్ ఉపన్యాసం ఇచ్చారు. డాక్టర్ ఈశ్వర్ మాట్లాడుతూ వచ్చే పదేళ్లలో అంతరిక్ష పరిశోధనలో భాతరదేశం మొదటిస్థానం చేరుకోగలదని ప్రతిఒక్కరిలో శాస్త్రీయ దృక్పధాన్ని పెంచడం ద్వారా ప్రపంచంలోనే ఆగ్రగామిగా భారత్ నిలుస్తుందన్నారు. శాస్త్రీయ దృక్పదాన్ని పెంచడంలో జనవిజ్ఞాన వేదిక పాత్రను అయన అభినందించారు. ఈ సమావేశంలో జెవివి రాష్ట్ర పరిశీలకులు రాహుల్ మాట్లాడుతూ ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా సూడో సైన్సును ఎక్కువగా ప్రచారం చేస్తున్నారని దీనిపై ప్రజలను చైతన్య పరిచేలా జెవివి చురుకైన పాత్ర పోషించాలన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో జెవివి చిత్తూరు జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
జెవివి చిత్తూరు జిల్లా నూతన కార్యవర్గం
జిల్లా అధ్యక్షులుగా ప్రొపెసర్ నాగేశ్వరావు, జిల్లా కార్యదర్శి జి.సుధాకర్, కోశాధికారి సుదర్శనాచారి, ఉపాధ్యక్షులు అరుణ శివప్రసాద్, కుమారస్వామిరెడ్డి, గిరిధర్‌మూర్తి, బిర్లానాయుడు, సాంబయ్య, కార్యదర్శులుగా రామచంద్ర, గాలిసురేష్, ఏకాంబరం, మధు, షణ్ముగం, విద్య, ద్వారకనాధ్, సుమతి, వీణావతి, సైన్సు అండ్ టెక్నాలజీ షమ్‌షేర్‌ఖాన్, చెకుముకి విజయకుమార్, ఆరోగ్యం వేణుగోపాల్, చిత్తూరు డివిజన్ కన్వీనర్ మునిరత్నం, గౌరవాధ్యక్షులుగా రంగనాథం, మునితర్నం, శ్యామలదేవి, మార్గదర్శులుగా ప్రొఫెసర్ వెంకటరెడ్డి, సీతారామయ్య, ప్రొఫెసర్ పెంచలయ్య, ఈసి సభ్యులుగా ఉమాపతి, శెల్వం, కేశవులురెడ్డి, హేమచంద్రారెడ్డి, అజ్మతుల్లా, త్యాగరాజులను సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకుంది.










