జెవికెఎస్ పోరాట విజయం
నేటి నుంచి తిరుమలలో అఖండ నామ సంకీర్తన
ఆనందోత్సాహంలో జానపద కళాకారులు
ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో
జానపద వృత్తి కళాకారుల సంఘం (జేవీకేఎస్) సుదీర్ఘకాలం చేసిన పోరాటం ఫలించింది. తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం దిగి వచ్చింది.. ఎప్పటిలాగే తిరుమలలో 24 గంటలు అఖండ నామ సంకీర్తనకు జానపద కళాకారులకు అవకాశం ఇచ్చింది. అవకాశంతోపాటు జానపద కళాకారులకు బస్ చార్జీలు, ఉచితంగా వసతి, శ్రీవారి దర్శనం కూడా కల్పించింది. ఈ నేపథ్యంలో తిరుపతిలో నేటి నుంచి నాలుగు రోజులపాటు మహతి కళాక్షేత్రంలో అన్నమయ్య నీరాజనం పేరుతో జేవీకేఎస్ ఆధ్వర్యంలో ఆలాపన పాటల పండగ మహోత్సవం జరుపుకుంటోంది.
తిరుమలలో అఖండనామ సంకీర్తన వేదికను ఏర్పాటు చేసి 24 గంటలు జానపద కళాకారులకు భజన చేసే అవకాశం ఇవ్వాలని జెవి కేఎస్ ఆధ్వర్యంలో గత పదేళ్లుగా పోరాటం సాగింది. ఈ సంఘం ఆధ్వర్యంలోనే పాదయాత్రలు, నిరాహార దీక్షలు, మెట్లు ఉత్సవం లాంటి భక్తి ఉద్యమ కార్యక్రమాలను శాంతియుతంగా చేపట్టారు. ఎట్టకేలకు దిగి వచ్చిన టీటీడీ యాజమాన్యం వీరికి 24 గంటలపాటు తిరుమలలో అఖండ నామ సంకీర్తనలు చేసుకునే అవకాశం కల్పించింది. బస్ చార్జీల్లో కోత, సరైన వసతి కల్పించలేకపోవడం వంటి వివక్షను పాటించింది. పక్కనే ఉన్న నాదనీరాజనంలో సంగీత కళ లను ప్రదర్శించే వారికి విమాన, రైలు ఛార్జీలను టిటిడినే భరించేది..ఆ కళాకారులకు సాదర స్వాగతం పలుకుతూ సకల సౌకర్యాలు కల్పించేవారు.. శ్రీవారి చరిత్రను దశదిశల చాటి చెప్పి పైసా ఆశించకుండా భక్తి భావంతో పనిచేసే పేద కళాకారుల పట్ల టీటీడీకి నిర్లక్ష్యం తగదని సౌకర్యాలపై ఉద్యమం చేసింది. అఖండనామ సంకీర్తనకు వచ్చే జానపద కళాకారులకు బస్ చార్జీ కిలోమీటర్‌కు 65 పైసలు చొప్పున ప్రకటించింది. శ్రీవారి దర్శనం కల్పించింది. వసతి భోజన సౌకర్యం మీరే చూసుకోవాలంటూ చేతులెత్తేసింది. అయితే రెండు గంటల పాటు ఒక టీం అలా 12 టీములు 24 గంటలు హరినామ సంకీర్తన పాడేవారు.. అఖిలాండము వెలుగుతూ ఉండాలి. సంకీర్తన పాడుతూ ఉండాలి. ఇది వీరి పని ఇంతలో కరోనా మహమ్మారి వచ్చి రెండేళ్లపాటు అఖండ రామ సంకీర్తనకు పేద కళాకారుల దూరమయ్యాడు.. ఏడాదిగా కరోనా ప్రభావం తగ్గింది. ఈ నేపథంలో శ్రీవారి దర్శనం యధాతథం అయింది. భక్తులు పెద్దసంఖ్యలో వస్తున్నారు. అన్నీ మొదలైన పేద కళాకారుడు కోరుకునే అఖండనం సంకీర్తన పునః ప్రారంభించలేదు. దీంతో జీవికేఎస్ తిరిగి ఉద్యమం చేపట్టింది. ఎట్టకేలకు స్పందించిన టీటీడీ యాజమాన్యం ఆగస్టు ఒకటి నుంచి అఖండనామ సంకీర్తన ప్రారంభించబోతుంది. కళాకారులకు వసతి, భోజన సౌకర్యం కల్పించింది. బస్సు చార్జీ కిలోమీటర్ కి ఒక రూపాయి 50 పైసలు పెంచింది. మూడు వంద రూపాయలు ప్రత్యేక దర్శనం వైపు ఉచితంగా వెళ్లేందుకు సౌకర్యం కల్పించింది.










