May 09,2023 20:26

ప్రజాశక్తి - పాలకొల్లు రూరల్‌
రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ సెక్రటరీ పిఎస్‌ ప్రద్యుమ్న మంగళవారం విజయవాడ నుంచి కాకినాడ పర్యటన నేపథ్యంలో మార్గ మధ్యలో పాలకొల్లు మండలం దిగమర్రు వచ్చారు. ఈ నేపథ్యంలో రోడ్ల పరిస్థితిపై జెసి ఎస్‌.రామ్‌సుందర్‌ రెడ్డితో సమీక్షించారు. రహదారులు ఎంత వరకూ వేశారు, ఎంత వరకూ వేయాల్సి ఉంది వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. దానికి సంబంధించిన మ్యాప్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జాతీయ రహదారి ఎస్‌ఇ సత్యనారాయణ, ఇఇ సంజీవ రాయుడు, ఆర్‌అండ్‌బి శాఖ జిల్లా అధికారి ఎస్‌.లోకేశ్వరరావు పాల్గొన్నారు.