ప్రజాశక్తి - భీమవరం రూరల్
జెఇఇ మెయిన్స్‌లో భీమవరం తిరుమల విద్యార్థులు విజయభేరి మోగించారని తిరుమల విద్యాసంస్థల డైరెక్టర్లు ఎస్.సాయిరాజు, పి.శ్రీనివాసవర్మ, జి.సతీష్‌బాబు తెలిపారు. శనివారం కళాశాలలో వారిని అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. విద్యాసంస్థల ఛైర్మన్ నున్న తిరుమలరావు ప్రోత్సాహంతో విద్యార్థులు ఈ ఘనత సాధించారన్నారు. 216వ ర్యాంకుతో వి.జుహిత రాధ ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు. ఎన్.వివేక్ 228వ ర్యాంకు, ఎల్‌ఆర్.వెంకసాయి 284వ ర్యాంకు, పి.మనోజ్‌కుమార్ 349వ ర్యాంకు, బి.హర్షచందర్ 455వ ర్యాంకు, జిఎస్‌ఎం.ప్రణవి 678 వర్యాంకు సాధించినట్లు తెలిపారు. 1161వ ర్యాంకు కె.ఉదయామ్, 1184వ ర్యాంకు పి.నవ్యశ్రీ, 1280వ ర్యాంకు సిహెచ్.రోహిత్ సత్య మణికంఠ, 1284వ ర్యాంకు డిపిఎస్. రమ్యలక్ష్మి, 1342వ ర్యాంకు కెఎస్‌వి.శివసాయికష్ణ, 1386వ ర్యాంకు వి.పృథ్విరాజు, 1789వ ర్యాంకు పిబి.వెంకటఫణి, 1794వ ర్యాంకు ఎన్‌వై.శ్రీరమ్య సాధించారని తెలిపారు. ఆల్ ఇండియాలో 500లోపు ర్యాంకు సాధించిన వారు ఐదుగురు, 1500లోపు 12 మంది, 3000లోపు 16 మంది, 5000లోపు 23 మంది, 10000 లోపు 37 మంది, 20000లోపు 83 మంది, 25 వేల లోపు 97 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్లు ఎస్.సాయిరాజు, పి.శ్రీనివాసవర్మ, జి.సతీష్‌బాబు మాట్లాడుతూ సుమారు 92 మందికి పైగా విద్యార్థులు కేవలం భీమవరం బ్రాంచి నుండే ఎన్‌ఐటి, ఐఐటి కళాశాలలో అడ్మిషన్లు సాధిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను వారు అభినందించారు.










