ప్రజాశక్తి - పాలకొల్లు
జెఇఇ మెయిన్స్ పరీక్షా ఫలితాల్లో తమ విద్యార్థులు ప్రతిభ కనబర్చారని పాలకొల్లు ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ ఎస్‌వి.రాఘవరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కప్పల అభిషేక్ వరమ్ 99.24920 పర్సంటైల్, కారుమూరి సుమశ్రీ 98.97 పర్సంటైల్, దొంగ రవికృష్ణ 98.60 పర్సంటైల్, ఏలూరి లక్ష్మి అమృత 98.49 పర్సంటైల్ సాధించారని తెలిపారు. అద్దేపల్లి హారిక 98.29, కడలి లక్ష్మీదుర్గ 96,22, పెనుగొండ సుధీష్ట 98.17, ములుగుర్తి పావని 97.11 పర్సంటైల్ సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 95 శాతం పైగా పర్సంటైల్ సాధించిన విద్యార్థులు 31 మంది అని తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను, శిక్షణ ఇచ్చిన అధ్యాపక బృందాన్ని విద్యాసంస్థల ఛైర్మన్ ఎన్.శేషారెడ్డి, డైరెక్టర్ ఎఒజి.వాసుబాబు అభినందించారు.










