అనంతపురం : అనంతపురం జెఎన్‌టియు ఇంజినీరింగ్ కళాశాలను 1962-1967లో విద్యను అభ్యశించిన పూర్వ విద్యార్థులు మంగళవారం కళాశాలను సందర్శించారు. అనంతరం వారు ఉపకులపతి రంగజనార్ధనను కాన్పరెన్స్ హాలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాలకు పూర్వ విద్యార్థుల సహకారం ఎప్పటికీ మరువలేనిది అని అన్నారు. పి.మునికృష్ణ, పరాశక్తి సిమెంట్ హైదరాబాద్ (1962-1967 బ్యాచ్), పూర్వ విద్యార్థులు కళాశాల అభివద్ధికి ఎంతో తోడ్పాటును అందిస్తున్నారని తెలిపారు. రాబోవు కాలంలో పూర్వ విద్యార్థుల సహకారంతో కళాశాలను మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని తెలిపారు. అనంతరం పూర్వ విద్యార్థులను ఉపకులపతి సన్మానించారు. ఈ కార్యక్రమంలో 1962-1967 పూర్వ విద్యార్థులు ఆర్.రమేష్, పి.మునికృష్ణ, పి.రఘునాథ రావు, కె.భాస్కర్ రెడ్డి, కె.వరదాచార్యులు, రెక్టార్ ఎం.విజయకుమార్, డైరెక్టర్లు ఫారిన్ అఫైర్స్, ఆలూమిని డైరెక్టర్ పి.సుజాత, దుర్గా ప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ అరుణ కాంతి పాల్గొన్నారు.










