Oct 06,2023 08:54

ఐఎస్‌ఒ సర్టిఫికెట్‌ అందుకుంటున్న విసి రంగజనార్ధన

           అనంతపురం: అనంతపురం జెఎన్‌టియుకు ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ స్టాండర్డ్‌ డైజేషన్‌(ఐఎస్‌ఒ) సర్టిఫికెట్‌ లభించిందని విసి రంగ జనార్ధన తెలిపారు. గురువారం స్థానిక వర్సిటీ పరిపాలన భవనం కాన్ఫరెన్స్‌ హాల్‌లో సర్టిఫికేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విసి మాట్లాడుతూ విశ్వవిద్యాలయానికి ఐఎస్‌ఒ సర్టిఫికెట్‌ రావడం అభినందనీయం అన్నారు. ఈ నాణ్యత ప్రమాణాలను కాపాడుకోవాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌వైఎం ఇంటర్నేషనల్‌ సర్టిఫికేషన్స్‌ ప్రయివేటు లిమిటెడ్‌ హైదరాబాద్‌కు చెందిన ఆలపాటి శివయ్య మాట్లాడుతూ అనంతపురం జెఎన్‌టియు విశ్వవిద్యాలయం నాణ్యత ప్రమాణాలను పాటిస్తోందని కితాబు ఇచ్చారు. శివయ్య చేతులమీదగా ఉపకులపతి ఆచార్య జి.రంగ జనార్ధనకు ఐఎస్‌ఒ సర్టిఫికేషన్‌ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రెక్టార్‌ ఆచార్య యం. విజయకుమార్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య సి.శశిధర్‌, యూనివర్సిటీ, డైరెక్టర్లు, జివి.సుబ్బారెడ్డి, ఓటిపిఆర్‌ఐ డైరెక్టర్‌ ఆచార్య బి.దుర్గాప్రసాద్‌, ప్రినిపాల్‌ ఆచార్య యస్‌వి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.