అనంతపురం : అనంతపురం జెఎన్‌టియు భద్రతా చర్యల్లో భాగంగా పటిష్ట చర్యలు చేపట్టినట్లు విసి రంగజనార్ధన పేర్కొన్నారు. మంగళవారం స్థానిక జెఎన్‌టియు ఇంజినీరింగ్ కళాశాల కాన్ఫరెన్స్ హాల్లో విద్యార్థులు, భోధన, భోధనేతర సిబ్బంది వాహనాలకు కళాశాల ఆవరణలోకి ప్రవేశించేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన స్టిక్కర్స్‌ను మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ భద్రతా ప్రయోజనాల దృష్ట్యా ప్రతి ఒక్కరూ తమ వాహనాలకు ఈ స్టిక్కర్స్‌ను అతికించుకోవాలని తెలిపారు. కళాశాలలో ఇతరుల ప్రవేశానికి గేట్ పాస్‌ను ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ ఎం.విజయకుమార్ మాట్లాడుతూ ఈ స్టిక్కర్స్‌ను అందజేయడం వల్ల భద్రతా ప్రయోజనాలు పెరుగుతాయని, విద్యార్థులలో క్రమ శిక్షణ పెరుగుతుందని తెలిపారు. అనంతరం విసి ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా అధ్యాపకులకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎస్‌వి.సత్యనారాయణ, రెక్టార్ ఎం.విజయ కుమార్, రిజిస్ట్రార్ సి.శశిధర్, వైస్ ప్రిన్సిపాల్ ఇ.అరుణ కాంతి, పిఆర్‌ఒ భానుమూర్తి, భువనవిజయ తదితరులు పాల్గొన్నారు.










