ప్రజాశక్తి-అనంతపురం వైస్ ఛాన్స్‌లర్ జి.రంగజనార్ధన ఆదేశాల మేరకు స్థానిక జెఎన్‌టియు పరిధిలోని బోధనేతర సిబ్బందిని బదిలీ చేస్తూ రిజిస్ట్రార్ సి.శశిధర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సూపరింటెండెంట్ మహేష్‌ను కలికిరి ఇంజినీరింగ్ కళాశాలకు, అక్కడ పని చేస్తున్న సూపరింటెండెంట్ మురళీకృష్ణను పులివెందుల ఇంజినీరింగ్ కళాశాలకు, అనంతపురం ఇంజినీంగ్ కళాశాలలో పని చేస్తున్న సూపరింటెండెంట్ జనార్ధన్‌రెడ్డిని రీసెచ్చ్ డెవలప్‌మెంట్ కార్యాలయానికి, పులివెందుల సూపరింటెండెంట్ సునీల్‌కుమార్‌ను అనంత జెఎన్‌టియుకు ఉపకులపతి సెక్రటరీగా, అనంత జెఎన్‌టియు ఇంజినీరింగ్ కళాశాల నుంచి సీనియర్ అసిస్టెంట్ కె.సుదర్శన్‌ను ఎస్టాబ్లిష్‌మెంట్ సెక్షన్‌కు, పులివెందులలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న పి.రాజేష్‌ను అనంత జెఎన్‌టియు ఎస్టాబ్లిష్‌మెంట్ సెక్షన్‌కు, సీనియర్ అసిస్టెంట్ పి. రాఘవేంద్రను పులివెందుల ఇంజినీరింగ్ కళాశాల నుంచి, అనంత జెఎన్‌టియు అకౌంట్ సెక్షన్‌కు, సీనియర్ అసిస్టెంట్ వి.రాఘవరెడ్డిను పులివెందుల ఇంజినీరింగ్ కళాశాల నుంచి జెఎన్‌టియు అకాడమిక్ ఆడిట్ కార్యాలయానికి, సీనియర్ అసిస్టెంట్ జి.శశికిరణ్‌ను పులివెందుల ఇంజినీరింగ్ కళాశాల నుంచి ఓటిపిఆర్‌ఐ కళాశాలకు, సీనియర్ అసిస్టెంట్ ఎన్.రవికుమార్‌ను అనంత జెఎన్‌టియు నుంచి పులివెందులకు, అనంత సీనియర్ అసిస్టెంట్ ఎస్.కుమారిను పులివెందుల ఇంజినీరింగ్ కళాశాలకు, సీనియర్ అసిస్టెంట్ సి.ముత్యాలును అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల నుంచి పులివెందుల ఇంజినీరింగ్ కళాశాలకు, సీనియర్ అసిస్టెంట్ గౌసియా నస్రీన్‌ను అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల నుంచి పులివెందుల ఇంజినీరింగ్ కళాశాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.










