Apr 09,2022 13:27

వెదురుకుప్పం (చిత్తూరు) : వెదురుకుప్పం మండలం దేవళంపేట జడ్పీ ఉన్నత పాఠశాలను బొమ్మయ్యపల్లె ఎంపిటిసి సభ్యుడు కొత్తపల్లి భాస్కర్‌ శనివారం సందర్శించారు. జగనన్న గోరు ముద్ద మధ్యాహ్న భోజన పథకం పై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారని విద్యార్థులు తెలిపారు. అనంతరం ఎంపిటిసి సభ్యుడు కొత్తపల్లి భాస్కర్‌ భోజనం రుచి చూసి సంతఅప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్‌ జి.ఉమాపతి, హెచ్‌ఎం సుందరం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.