Feb 25,2023 21:49

ప్రజాశక్తి - పాలకొల్లు
             స్థానిక బివిఆర్‌ఎం గర్ల్స్‌ హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనాన్ని ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఉషా లక్ష్మీకుమారి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనంతోపాటు మరుగుదొడ్లు తదితర సదుపాయాలపై ఆరా తీశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని పర్యవేక్షకులకు సూచించారు. విద్యార్థులతో మాట్లాడి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. మధ్యాహ్న భోజనం రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థినులు బాగా చదువుకోవాలని, భవిష్యత్తులో ఉన్నత స్థితిలో ఉండాలని కోరారు.