Sep 25,2023 22:13

మెడల్స్‌ను అందజేస్తున్న వేణుగోపాల్‌

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌:విజయవాడ, విశాఖపట్నం కేంద్రాల్లో ఇటీవల నిర్వహించిన జాతీయస్థాయి కుంగ్‌ఫు, కరాటే పోటీల్లో సిక్కోలు విద్యార్థులు సత్తా చాటారు. పది బంగారు, నాలుగు వెండి, మూడు రజత పతకాలు అందుకున్నారు. వారికి నగరంలోని ఏడు రోడ్ల కూడలిలోని కళ్యాణ మండపంలో సాయిబాబాస్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన మెడల్స్‌, సర్టిఫికెేట్లను సోమవారం అందజేేశారు. ఎపిడబ్ల్యుజెఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కె.వేణుగోపాల్‌, లయన్స్‌ ఇంటర్నేషనల్‌ జిల్లా చైర్మన్‌ నటుకుల మోహన్‌, వాకర్స్‌ ఇంటర్నేషనల్‌ డిప్యూటీ గవర్నర్‌ కొంక్యాన మురళీధర్‌, చిన్నీస్‌ నెట్‌ జోన్‌ అధినేత కెల్ల కిషోర్‌ తదితరులు విద్యార్థులను అభినందించారు.