Nov 01,2023 00:01

శ్రీకాకుళం : చిత్రపటానికి పూలమాలలు వేస్తున్న ఎస్‌పి రాధిక

ప్రజాశక్తి- శ్రీకాకుళం: ఐకమత్యా సామరసస్యాంతో ప్రతిఒక్కరూ జాతీయ సమైక్యతాలో భాగస్వామ్యం కావాలని ఎస్‌పి జి.ఆర్‌ రాధిక పిలుపునిచ్చారు. భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి, కేంద్ర మాజీ హోమ్‌మంత్రి సర్దార్‌ వల్లభారు పటేల్‌ జయంతి పురస్కరించుకుని జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్‌ కార్యాలయంలో మంగళవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. .అనంతరం పోలీసు సిబ్బందితో, అధికారులతో భద్రతను కాపాడడానికి స్వయంగ అంకితమవుతాం... సందేశాన్ని తోటివారందరిలో విస్తరింపచేయడానికి గట్టిగా కషి చేస్తూ సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాట్లాడుతూ దేశాన్ని ఏకతాటిపై నడిపించిన మహనీయుడు పటేల్‌ అని కొనియాడారు. ఆపరేషన్‌ పోలో అనే చర్యల ద్వారా దృఢ సంకల్పంతో భారతదేశంలో అనేక సంస్థానాలను విలీనం చేసి భారతదేశాన్ని ఏకతాటిపైకి తెచ్చి, దేశ ఐక్యతకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి సర్దార్‌ అని అన్నారు. ప్రతిఒక్కరూ దేశ సమైక్యత, సమగ్రతకు కృషి చేయాలన్నారు. అంతర్గత భద్రతకు ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి జాతీయ ఐక్యతాలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. దేశ స్ఫూర్తిని, అభివృద్ధి ఫథంలో నడిపించాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్‌పి టి.పి.విఠలేశ్వరరావు, డిఎస్‌పిలు వై.శృతి, ఎస్‌. వాసుదేవ్‌, డి.ప్రసాదరావు, విజయకుమార్‌, ఆర్‌ఐ డి.సురేష్‌, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఉక్కుమనిషి సర్దార్‌ వల్లభారు పటేల్‌ జయంతిని పురస్కరించుకుని ఐక్యత రన్‌ను నగరంలో నిర్వహించారు. మంగళవారం పటేల్‌ జయంతి, రాష్ట్రీయ ఏక్తాదివాస్‌లో భాగంగా స్థానిక ఆర్ట్స్‌ కాలేజ్‌ నుంచి ఏడు రోడ్ల కూడలి వరకు నిర్వహించిన 'యూనిటీ రన్‌'ను అదనపు ఎస్‌పి టి.పి.విఠలేశ్వర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. ఈ ఐక్యతా పరుగులో జిల్లా పోలీస్‌ అధికారులు, సిబ్బంది, యువత, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. యూనిటీ రన్‌ అంబేద్కర్‌ కూడలి నుంచి ఏడు రోడ్ల కూడలి వద్దకు సాగి మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పటేల్‌ దేశానికి చేసిన సేవలకు గుర్తుగా ఈ ఐక్యతా పరుగును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయన దృఢ సంకల్పంతో స్వాతంత్య్రానంతరం అనేక సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి భారతదేశాన్ని ఏకతాటిపైకి తెచ్చి, దేశ ఐక్యతకు కషిచేశారని అన్నారు. కార్యక్రమంలో డిఎస్‌పి వై.శృతి, డి.ప్రసాద్‌, సిఐ పి.శ్రీనివాసరావు, ఆర్‌ఐ డి.సురేష్‌, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
శ్రీకాకుళం అర్బన్‌ : భారతదేశం గర్వించదగ్గ మహనీయుడు సర్ధార్‌ వల్లభారు పటేల్‌ అని ట్రిపుల్‌ ఐటి ప్రొఫెసర్‌ పెద్దాడ జగదీశ్వరరావు అన్నారు. శ్రీకాకుళం రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యాన రాష్ట్రీయ ఏక్తా దివస్‌ను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎఒ మునిరామకృష్ణ, అకాడమిక్‌ డీన్‌ కె.మోహన్‌ కృష్ణచౌదరి, డిప్యూటీ ఎఒ డాక్టర్‌ రఘుపతిరావు, వెల్ఫేర్‌ డీన్‌ గేదెల రవి, ఎన్‌ఎస్‌ఎస్‌ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ పి.ముకుందరావు, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్‌ వి.సింహాచలం, డాక్టర్‌ బి.శ్రీధర్‌, ఆర్‌.మళ్లీశ్వరి, డాక్టర్‌ జి.ఈశ్వరరావు, డాక్టర్‌ ఆర్‌.గణపతిరావు, డాక్టర్‌ ఆర్‌.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
జిల్లా కేంద్ర గ్రంథాలయంలో మంగళవారం సర్థార్‌ వల్లభారు పటేల్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి కార్యదర్శి బి.కుమార్‌ రాజు పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాల భారతదేశ నిర్మాణానికి కృషి చేసి విజయం సాధించిన ఉక్కుమనిషి సర్దార్‌ వల్లభారు పటేల్‌ అన్నారు. కార్యక్రమములో డిప్యూటీ లైబ్రేరియన్‌ వి.వి.జి.ఎస్‌.శంకరరావు, లైబ్రేరియన్‌ ఎస్‌.వి.రమణమూర్తి, పి.రామమోహన్‌, గణేష్‌, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆరోగ్య సమాజ ఆవిష్కరణలో స్టార్‌ వాకర్స్‌ క్లబ్‌ సేవలు అమోఘమని నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేష్‌ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో మంగళవారం మాజీ మంత్రి సుంకరి ఆళ్వార్‌ దాస్‌ జయంతిని పురష్కరించుకొని వాకర్స్‌ ఇంటర్నేషనల్‌ డేను, సర్దార్‌ వల్లభభాయి పటేల్‌ జయంతిని పురష్కరించుకొని ఏక్తాదివాస్‌ కార్యక్రమాన్ని స్టార్‌ వాకర్స్‌క్లబ్‌ అధ్యక్షులు శాసపు జోగినాయుడు అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా రూ.40వేలు వెచ్చించి అందించిన స్పోర్ట్స్‌ దుస్తులను గిరిజన విద్యార్థులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిఐపిఆర్‌ఒ కె.చెన్నకేశవరావు, లయన్స్‌ క్లబ్‌ హర్షవల్లి వ్యవస్థాపకులు హారికాప్రసాద్‌, గజల్స్‌ గాయకుడు డాక్టర్‌ ఎం.వాసుదేవాచారి పాల్గొన్నారు.
కాకినాడ ఆదిత్యలో...
నగరంలోని కాకినాడ ఆదిత్య డిగ్రీ కళాశాలలో వల్లభారు పటేల్‌ చిత్రపటానికి డైరెక్టర్‌.బి.ఎస్‌.చక్రవర్తి, ప్రిన్సిపాల్‌ ఎన్‌.వి.వేణుగోపాల్‌లు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ డి.విక్రమ్‌, లక్ష్మీకాంత్‌, లైబ్రేరియన్‌ పి.కృష్ణారావు పాల్గొన్నారు.
నౌపడ: సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం జిల్లా పరిషత్‌ ప్రభుత్వన్నత పాఠశాలలో 75 అడుగుల జాతీయ పతాకంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు మంగళవారం సమైక్యతా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోత చైతన్య ఆధ్వర్యాన సర్దార్‌ వల్లభారు పటేల్‌ చిత్రపటానికి పూలమాలలు వేసిన నివాళ్లర్పించారు. అనంతరం విద్యార్థులతో జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు భాస్కరరావు, వీరభద్రరావు, లక్ష్మీకాంతం, తిరుపతిరావు ఆదికేశవరెడ్డి, లక్ష్మి, నాగేశ్వరరావు, పార్వతి, రాము, చిన్నారావు పాల్గొన్నారు.
కవిటి: కవిటి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, కళ్యాణి ఆంగ్ల పాఠశాల, ఎస్విజే విద్యాసంస్థల్లో వల్లభాయి పటేల్‌ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో అధ్యాపకులు జి.విష్ణుమూర్తి, బి.హరి, పాపారావు, ఎస్విజే ప్రిన్సిపాల్‌ ఎం.భాస్కరరావు, పి.సత్యనారాయణ, కళ్యాణి పాఠశాల సిబ్బంది బి.రాణి, గీత పాల్గొన్నారు.
లావేరు: భారతరత్న ఉక్కుమనిషి సర్దార్‌ వల్లభారు పటేల్‌ జయంతిని స్థానిక శాఖా గ్రంథాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా వల్లభారుపటేల్‌ చిత్రపటానికి గ్రంథాలయాధికారి మురపాక శ్రీనివాసరావు పూలమాల వేసి నివాళ్లర్పించి మాట్లాడారు. కార్యక్రమంలో గ్రంథాలయ సహాయకులు ఎ.గడ్డియ్య, విద్యార్థులు పాల్గొన్నారు.
ఎచ్చెర్ల: భారతరత్న, ఉక్కుమనిషి సర్దార్‌ వల్లభారు పటేల్‌ 148వ జయంతిని ధర్మవరం శాఖా గ్రంథాలయంలో మంగళవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి గ్రంథాలయాధికారి మలిపెద్ది చంద్రశేఖర్‌ పూలమాలలు వేసి నివాళ్లర్పించి మాట్లాడుతూ విశాల భారతదేశ నిర్మాణానికి కృషి చేసి విజయం సాధించిన ఉక్కుమనిషి సర్దార్‌ వల్లభారు పటేల్‌ అన్నారు. వల్లభారు పటేల్‌ జీవిత చరిత్రపై విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో ప్రధమ, ద్వితీయ, తృతీయ, బహుమతులను గ్రంథాలయాధికారి అందజేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సహాయకులు సూర్యనారాయణ, గ్రంథాలయ పాఠకులు దాసరి రమణ, ముద్దాడ నవీన్‌, పొట్నూరు మధు, బగ్గు జగదీష్‌, మహేష్‌, సూరిబాబు, ప్రకాష్‌, విద్యార్థులు పాల్గొన్నారు.
సంతబొమ్మాళి: స్థానిక శాఖా గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈయన చిత్రపటానికి గ్రంథాలయాధికారి కె.రామకృష్ణ, భవిత స్కూల్‌ ఉపాధ్యాయులు భాస్కర్‌, బి. అచ్చుతారావు పూలమాల వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమములో గ్రంథాలయ పాఠకులు పాపారావు, నారాయణ, ఉమామహేష్‌, సహాయకులు బాబురావు, విద్యార్థులు పాల్గొన్నారు.
నందిగాం:సర్దార్‌ వల్లభారు పటేల్‌ జయంతి, జాతీయ ఐక్యతాదినోత్సవం సందర్భంగా పెడ్డతామరాపల్లి మండల పరిషత్‌ పాఠశాలలో ప్రధానోపాద్యాయులు కె.గున్నయ్య ఆధ్వర్యాన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐక్యతా ప్రతిజ్ఞను విద్యార్థులచే చేయించారు. ఐక్యతకు సూచికగా మానవహారం, ఐక్యతా గీతాలు ఆలపించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు బి. శంకరరావు, కుమారి, వనిత, విద్యార్థులు పాల్గొన్నారు.
బుర్జ: సర్దార్‌ వల్లభారు పటేల్‌ జయంతి వేడుకలను స్థానిక జూనియర్‌ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌.తవిటినాయుడు, ఎన్‌ఎస్‌ఎస్‌ పిఒ ఠాగూర్‌, శశిధర్‌, అధ్యాపక, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రతిజ్ఞ చేసారు.
ఆమదాలవలస: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో సర్దార్‌ వల్లభారు పటేల్‌ జయంతి దినోత్సవాన్ని జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ జలుమూరు రవిబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థుల చేత జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మేరా మట్టి దేశ్‌ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు దీపాలను వెలిగించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్‌ బి. శ్యాంసుందరరావు, అధ్యాపక, అధ్యాపకేతరులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మండలంలోని దూసి అంగన్వాడీ కేంద్రంలో సర్దార్‌ వల్లభారు పటేల్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త పంచాది లతా దేవి, అంగన్వాడీ సహాయకురాలు రమణమ్మ, మధ్యాహ్న భోజన కార్మికురాలు సూరీడమ్మ, చిన్నారులు పాల్గొన్నారు.
టెక్కలి: టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఉక్కుమనిషి సర్దార్‌ వల్లభారు పటేల్‌ జన్మదిన వేడుక రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ తెంబురు గోవిందమ్మ, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బేపల సతీష్‌కుమార్‌, కో-ఆర్డినేటర్‌ వి.లూక్‌పాల్‌, టి.త్రినాధరావు, ఎస్‌.ధర్మారావు. కంచరాన శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, విద్యార్దులు పాల్గొన్నారు.
రణస్థలం: స్థానిక ప్రజాపరిషత్‌ కార్యాలయంలో స్వాతంత్య్ర సమరయోధులు, ఉక్కు మనిషి సర్ధార్‌ వల్లభారు పటేల్‌ జయంతి పురస్కరించుకుని మంగళవారం ఆయన చిత్రపటానికి ఎంపిపి ప్రతినిధి, వైసిపి నాయకులు పిన్నింటి సాయికుమార్‌, జెడ్‌పిటిసి టొంపల సీతారాం పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్దార్‌ వల్లభారు పటేల్‌ భారతదేశ స్వాతంత్య్రం కోసం చేసిన సేవలు చరిత్రలో నిలుస్తాయని, దేశ ఐక్యతకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచారని కొనియాడారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మహంతి పెదరాము నాయుడు, మండల జెసిఎస్‌ ఇన్‌ఛార్జి చిల్ల వెంకట్‌ రెడ్డి, మండల పరిషత్‌ సిబ్బంది పాల్గొన్నారు.