ప్రజాశక్తి -నెల్లూరు :గ్రామీణ స్థాయిలో పశు పోషణ ద్వారా పాడి రైతుల ఆర్థిక పురోగతి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలు చేస్తున్న జాతీయ లైవ్ స్టాక్ మిషన్ పథకాన్ని రైతులు నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ దొడ్డం రెడ్డి నిరంజన్ బాబు రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం స్థానిక టౌన్ హాలులో పశు సంవర్థకశాఖ ఆధ్వ ర్యంలో జాతీయ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా పాడి రైతులకు అందించే సబ్సిడీ రుణాలపై జిల్లా స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ దొడ్డం రెడ్డి నిరంజన్ బాబు రెడ్డి మాట్లాడు తూ పాడి రైతులకు క్షేత్రస్థాయిలో జాతీయ లైవ్ స్టాక్ మిషన్ పై అవగాహన కల్పించి, సబ్సిడీ రుణా లను విరివిగా మంజూరు చేసేందుకు అధికారులు తోడ్పాటు అందించాలని సూచించారు. ఈ స్కీం ద్వారా 10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు వివిధ పాడి యూనిట్ల స్థాపనకు గరిష్టంగా 50 లక్షల వరకు రాయితీపై రుణాలను అందించను న్నట్లు చెప్పారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జాతీయ లైవ్ స్టాక్ మిషన్ రుణాలను పొందడం, గొర్రెలు, మేకల పెంపకం, వ్యాధుల నివారణ, సాంకేతిక యాజమాన్య పద్ధతులపై డాక్టర్ మాలకొండయ్య, డా బాల కోటేశ్వరరావు రైతులకు క్లుప్తంగా వివరించారు. పశు సంవర్థక శాఖ జేడీ డాక్టర్ కోటేశ్వరరావు, జడ్పీ సీఈవో చిరంజీవి, ఎల్డిఎం ప్రదీప్ కుమార్, ఐఎస్డిపి ఎడి మాధవీలత, డిడిలు సోమయ్య, రమేష్, చంద్రశేఖర్, నాగమణి, పశువైద్యాధికారులు, పాడి రైతులు పాల్గొన్నారు.










