May 15,2022 22:02

గెలుపొందిన విద్యార్థులతో ప్రధానోపాధ్యాయులు

ప్రజాశక్తి - యాదమరి: జాతీయ చిత్ర కళా పోటీలలో యాదమరి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల బాల బాలికలు, స్వర్ణం, రజతం అవార్డును కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రధానోపాధ్యాయులు గిరి రాజా మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులు మానసిక వికాసానికి, వారిలో ఏకాగ్రత, సజనాత్మకత శక్తిని పెంపొందించుకోవడానికి చిత్రలేఖనం ఎంతో దోహదపడుతుందన్నారు. మార్చి నెలలో డ్రీమ్‌ చిల్డ్రన్స్‌ ఆర్ట్‌ అకాడమీ వారు అఖిల భారత జాతీయ స్థాయి బాలల చిత్రకళా పోటీలు విజయవాడలో నిర్వహించారు. యాదమరి ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఇందులో నాలుగు స్వర్ణాలు కైవసం చేసుకున్న విద్యార్థులు, ప్రతిభ, జ్ఞానప్రియ, ప్రియాంక, మూసీదా, స్వర్ణ పతకం సాధించారు. రజిత పతకాలు కైవసం చేసుకున్న విద్యార్థులు సౌమ్య, మోనిషా, ఫాతిమా, జీత్‌ సీతా శ్రీ, చరణ్‌, ఉస్మాన్‌, పద్మావతి, మాధురి, హాసిని, పవిత్ర, హనీషా 12 మంది విద్యార్థులు రజిత పతకాలు కైవసం చేసుకున్నారు. ఈ అవార్డు గ్రహీత విద్యార్థినులను మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు, శిక్షణ ఇచ్చిన ఆర్ట్‌ మాస్టర్‌ కే. దామోదర్‌ ఆచారి, పాఠశాల ఉపాధ్యాయుల బందం అభినందించారు.