జూడో పోటీలకు ఎంపికైన విద్యార్ధులు.
ప్రజాశక్తి-తిరుపతి సిటి
మార్చి 5 నుంచి 9 వరకు రాజస్తాన్‌లోని గంగానగర్‌లో జరిగే 10వ జాతీయస్థాయి బ్లైండ్ అండ్ డప్ జూడో చాంపియన్‌షిప్ -2022లో పాల్గొనే క్రీడాకారులకు డాలర్స్ గ్రూప్ చైర్మన్ దివాకర్ రెడ్డి యూనిఫామ్ అందజేశారు. శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ జట్టు క్రీడాకారులు శేషగిరి, రాజశేఖర్, చిత్తూరు జిల్లాకు చెందిన రమా, శ్రీకాకులం జిల్లాలకు యూనిఫాం, 10వేల రుపాయలను జెన్ అకాడమి అధ్యక్ష్యులు రాజేష్, ఏ.పి డఫ్ జూడో అషోషియేషన్ అధ్యక్ష్యులు భానుప్రకాష్ రెడ్డి, కార్యదర్శి కిరణ్ కుమార్, స్పొర్ట్స్ కాంప్లెక్స్ ఏ.ఓ జయరామయ్య చేతులమీదగా అందజేసారు.










