Sep 27,2023 22:58

మాట్లాడుతున్న ప్రిన్సిపాల్‌ సురేఖ

* ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సురేఖ
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌: 
ప్రజలను జాగృతం చేసే రీతిలో గుర్రం జాషువా రచనలు స్ఫూర్తిదాయకమని ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.సురేష్‌ పేర్కొన్నారు. జాషువ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యాన బుధవారం వేడుకలను నిర్వహించారు. ముందుగా జాషువ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాషువా సాహితీ సేవ ఎంతో విశిష్టతను సంతరించుకుందని పేర్కొన్నారు. రచనల్లో చలోక్తులు పాఠకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలుగు విభాగాధిపతి డాక్టర్‌ పి.వి.రమణ, తెలుగు అధ్యాపకులు పి.నారాయణరావు, డాక్టర్‌ ఢిల్లీశ్వరరావు, ఐక్యూఎసీ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఆర్‌.హరిత, సంస్కృత విభాగాధిపతి డాక్టర్‌ రామారావు, డాక్టర్‌ ఎస్‌.శశిభూషణ్‌, డాక్టర్‌ ప్రమీల, డాక్టర్‌ కె.వాసు పాల్గొన్నారు.